హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్మీపై రాళ్లు వేస్తే ఇక చేతులుండవు.. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా యాక్షన్ మూడ్‌లో ఉన్నారని.. ఈ సమయంలో ఎవరైనా అడ్డొస్తే వారి భాషలోనే సమాధానం చెప్పేందుకు ఇద్దరు కూడా రెడీగా ఉన్నారని చెప్పుకొచ్చారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే విధంగా 370, 35(ఏ) ఆర్టికల్స్‌ను రద్దు చేయడం భారతదేశ చరిత్రలో మరచిపోలేని రోజుగా అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు కట్టుబడి మోడీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. మాటిస్తే మడమ తిప్పని నేతగా మోడీ మరోసారి ప్రూవ్ చేసుకున్నారని.. ఇక జమ్ము కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మోడీ నిర్ణయంపై రాజాసింగ్ హర్షం

మోడీ నిర్ణయంపై రాజాసింగ్ హర్షం

జమ్ము కశ్మీర్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎవరూ చేయలేని సాహసం ఆయన చేశారని కితాబిచ్చారు. ఏళ్లకొద్దీ నానుతున్న సమస్యకు చిటికెలో పరిష్కారం చూపారని కొనియాడారు. 370, 35(ఏ) ఆర్టికల్స్ రద్దుతో జమ్ము కశ్మీర్‌లో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీ కారణంగా జమ్ముకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి వచ్చిందని. ఇకపై అక్కడికి ఎవరైనా వెళ్లొచ్చని.. ఎవరైనా ఉండొచ్చని చెప్పుకొచ్చారు. జమ్ముకశ్మీర్లో ఇదివరకు వేరే జెండా ఉండేదని.. ఇప్పుడు ఆ జెండా మారిపోతుందని వ్యాఖ్యానించారు. తిరంగా జెండా రెపరెపలాడుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
ఇకపై జమ్ముకశ్మీర్ ప్రతి గల్లీలో త్రివర్ణ పతాకం ఎగురుతుందని.. భారతదేశంలో ఈరోజు ఎవరూ మరచిపోలేరని వెల్లడించారు.

ఆర్టికల్ 370, 35(ఏ) రద్దు.. న్యాయవాదుల సంబరాలు (వీడియో)ఆర్టికల్ 370, 35(ఏ) రద్దు.. న్యాయవాదుల సంబరాలు (వీడియో)

ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి.. ఇకపై ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు వస్తాయి

370, 35(ఏ) ఆర్టికల్స్ రద్దు అనేది అందరికీ శుభవార్త అని అన్నారు రాజాసింగ్. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ గానీ ఇతర పార్టీల నేతలు గానీ ఎవరైనా సరే మోడీ నిర్ణయాన్ని స్వాగతించాలని సూచించారు. ఆ క్రమంలో కొందరు వ్యతిరేకిస్తుండటం సరికాదని.. దయచేసి వారు కూడా మోడీ నిర్ణయాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ ఇవ్వాలని కోరారు.

మోడీ నిర్ణయంతో ఇప్పుడు అక్కడ ఎవరైనా స్థలాలు కొనుక్కోవచ్చు.. ఎవరైనా ఫ్యాక్టరీలు పెట్టొచ్చని వివరించారు. జమ్ము కశ్మీర్ యువకులకు ఇది మంచి శుభవార్త అని అన్నారు. ఇప్పటివరకు అక్కడ 500 రూపాయలిస్తే భారత సైనికులపై రాళ్లు వేసేవారు.. 1000 రూపాయలిస్తే తుపాకులు చేతబట్టి ఆర్మీపై తిరగబడేవారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చారు. 370, 35(ఏ) ఆర్టికల్స్ రద్దుతో జమ్ము కశ్మీర్‌లో ఫ్యాక్టరీలు, కంపెనీలు వస్తాయి. దాంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అంతేకాదు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా వస్తాయని వెల్లడించారు. ఇదివరకు ఆ రెండు ఆర్టికల్స్ అడ్డు వచ్చేవని.. ఇప్పుడు మోడీ సర్కార్ రద్దు చేయడంతో ఆ బాధ తప్పిందని చెప్పారు.

ఇక అరాచక శక్తుల ఆటలు సాగవు.. ఆర్మీపై రాళ్లు వేస్తే చేతులుండవు..!

ఇక అరాచక శక్తుల ఆటలు సాగవు.. ఆర్మీపై రాళ్లు వేస్తే చేతులుండవు..!

మోడీ తీసుకున్న మంచి నిర్ణయానికి కశ్మీర్ లో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి పార్టీ నేత మోడీకి సపోర్ట్ చేయాలని కోరారు. ఒకవేళ కాదు కూడదని.. మరొకసారి ఆర్మీపైన రాయి వేస్తే ఆ చేతులుండవు జాగ్రత్త అని హెచ్చరించారు. ఒకప్పుడు ఆర్మీపైన రాళ్లు వేస్తే దండం పెట్టే ప్రభుత్వముండేది.. కానీ ఇప్పుడున్నది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు రాళ్లు వేస్తే డైరెక్ట్ బుల్లెట్ దించుడే అన్నారు.

ఇక అక్రమంగా చొరబడుతున్న టెర్రరిస్టులు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. కశ్మీర్‌లో ఇకపై టెర్రరిస్టులు, అరాచక శక్తులు ఉండటానికి వీల్లేదన్నారు. ఆర్మీ జోలికి వస్తే ఖతమై పోతారంటూ హెచ్చరించారు. మోడీ, అమిత్ షా యాక్షన్ మూడ్ లో ఉన్నారని.. ఈ సమయంలో ఎవరైనా అడ్డొస్తే వారి భాషలోనే జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. 370, 35(ఏ) ఆర్టికల్స్ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దరిమిలా ఆయన మీడియాకు రిలీజ్ చేసిన వీడియో సారాంశం ఇది.

English summary
Prime Minister Narendra Modi and Union Minister Amit Shah are in the mood for action. The cancellation of Articles 370 and 35 (a) to make Jammu and Kashmir self-sufficient has been described as an unforgettable day in the history of India. Modi has made a sensational decision to comply with the election manifesto's promise. Hyderabad Goshamahal MLA Raja Singh released a video according to that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X