హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యాక్సిన్ నిల్వ ఉన్నా.. ఇవ్వరా, కేసీఆర్ సర్కార్‌పై రాములమ్మ నిప్పులు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సర్కారుపై రాములమ్మ విజయశాంతి ఫైరయ్యారు. ఎ వైపు చూసినా వైఫల్యాలేనని అసహనం వ్యక్తం చేశారు. పరిస్థితులను చక్కబెట్టేందుకు అవసరమైన ప్రణాళికలను ఏ మాత్రం రచించడం లేదని మండిపడ్డారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదని, ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదని విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై గతంలో సత్వర చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. రాష్ట్రంలో ఇంకా 6.90 లక్షల పైచిలుకు వ్యాక్సిన్ డోసుల నిల్వలున్నాయని వివరించారు. గత మూడు రోజులుగా వ్యాక్సినేషన్‌ను ఆపేశారని విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు మల్లాపూర్‌కు చెందిన ఓ గర్భిణిని చేర్చుకోవడానికి నిరాకరించిన వైనంపై కూడా విజయశాంతి స్పందించారు. మల్లాపూర్‌కు చెందిన ఓ గర్భిణిని చేర్చుకోడానికి ఐదు ఆస్పత్రులు నిరాకరించి, ఆమెను మృత్యుకోరల్లోకి నెట్టేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ramulamma slams ts government

Recommended Video

Gynaecologist Dr Abhinaya Alluri Interview PART 3 | oneindia telugu

తెలంగాణ రైతాంగ పరిస్థితిపై కూడా స్పందించారు. రైతులు పండించిన వడ్లు, వాటి కొనుగోళ్లలో సర్కార్ ఉదాసీనతతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ధాన్యం వర్షం పాలై, రైతులు మరోసారి నష్టపోయారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందే సమయంలో నష్టపోతుందని.. ఏటా ఇలాగే జరుగుతున్న తగిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదని వివరించారు.

English summary
ramulamma vijayashanti slams telangana government on coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X