హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్: నిందితులు ఇంకెన్ని అఘాయిత్యాలు చేశారో.. రాజా సింగ్ సందేహాం

|
Google Oneindia TeluguNews

జూబ్లీహిల్స్ రేప్ కేసు ప్రకంపనలు రేపుతుంది. విపక్షాలు.. పోలీసుల తీరును, ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు.
దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో నిందితులు ఇదే కాక మరెన్నో అఘాయిత్యాలకు ఒడికట్టి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఆ నిందితులకు నార్కో టెస్టు జరపాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. సీబీఐ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తండ్రి టీఆర్ఎస్ పార్టీలో, ఎంఐఎం పార్టీలో ఉంటే తామేం చేసినా భయపడనక్కర్లేదనే భావనకు నేతల పిల్లలు వచ్చారని రాజా సింగ్ విమర్శించారు. తాము చెప్పిందే వేదం, తమకు ఎదురులేదని సదరు నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు.

jubilee hills rape case culprits did more rapes bjp mla raja singh alleges

టీఆర్ఎస్ నేతల వల్ల తెలంగాణ అత్యాచారాలకు నెలవుగా మారుతుందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రైమ్ రేటు తగ్గిందని సీఎం కేసీఆర్, హోంమంత్రి, కేటీఆర్ డప్పు కొట్టుకుంటున్నారని, జరుగుతున్న ఘటనలు చూస్తుంటే క్రైమ్ రేటు మరింత పెరిగినట్టు అర్థమవుతోందని తెలిపారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన మరువక ముందే మొఘల్ పురాలో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని రాజా సింగ్ గుర్తుచేశారు.

జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక గుల్బర్గాలో మైనర్‌ను నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఓ రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లో గల ఫాం హౌస్ వద్ద ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ రాజకీయ నేతకు చెందిన ఫాం హౌస్‌లో తలదాచుకున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచే వేర్వేరు ప్రాంతాలకు పరారయ్యారు. ఇన్నోవా కారును ఆ ఫాం హౌస్ వెనుక దాచినట్టు సమాచారం.

English summary
jubilee hills rape case culprits did more rapes bjp mla raja singh alleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X