ఎలుకలు కొరికిన వ్యక్తి మృతి - నిమ్స్ లో చికిత్స పొందుతూ : ప్రభుత్వం సీరియస్..!!
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకొలు కొరుకుతున్న బాధితుడు మృతి చెందాడు. బాధితుడుని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. హన్మకొండ భీమారానికి చెందిన శ్రీనివాస్.. ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో వారం రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. ఆర్‌ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎలుకలు అతడిపై దాడి చేశాయి.
అక్కడి అధికారులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో శ్రీనివాస్‌ను ఎలుకలు కొరుక్కుతినడంతో తీవ్రరక్తస్రావం అయ్యింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో..ప్రభుత్వం సీరియస్ అయింది. శ్రీనివాస్‌పై ఎలుకల దాడిపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
మరోవైపు ఆరోగ్యం విషమించడంతో ఎంజీఎం నుంచి నిమ్స్‌కు తరలించారు. అయితే, డయాలసిస్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన నాటి నుంచే శ్రీనివాస్‌పై ఎలుకలు దాడి చేస్తున్నాయని బాధితుడి బంధువులు చెబుతున్నారు. రెండు చేతులు, రెండు కాళ్లను ఎలుకలు కొరికి తీవ్రంగా గాయపరిచాయని వాపోయారు. శ్రీనివాస్ మృతదేహాన్ని నిమ్స్ నుంచి కుటుంబ సభ్యులు హన్మకొండకు తీసుకెళ్లారు.

ఈ ఘటనపైన స్పందించిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై బదిలీ వేటువేయటంతో పాటుగా..మరో ఇద్దరు డాక్టర్ల పైనా కఠిన చర్యలు తీసుకుంది. చికిత్సకు శ్రీనివాస్ శరీరంలోని అవయవాలు సహకరించలేదని వైద్యులు చెబుతున్నారు. చివరి వరకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదని వెల్లడించారు. ఇప్పటికే ఆర్దికంగా కష్టాల్లో ఉన్నామని.. తన భర్త మరణంతో మరింతగా తమ పరిస్థితి కష్టంగా మారుతోందని మృతుడి భార్య కన్నీటిపర్యంతం అవుతున్నారదు. ప్రభుత్వం తమకు ఆదుకోవలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications