రౌడీషీట్ ఎత్తేసిన ఆనందం.. రౌడీ షీటర్లతో కలిసి రేవ్ పార్టీ.. అశ్లీలనృత్యాలు; 48మంది అరెస్ట్!!
రౌడీషీట్ ఎత్తేసిన ఆనందంలో ఓ మాజీ రౌడీషీటర్ చేసిన పని మళ్లీ వారిపై కేసు నమోదు అయ్యేలా చేసింది. తనపై రౌడీషీట్ ఎత్తివేసిన ఆనందంలో ఉన్న ఆ మాజీ రౌడీషీటర్ స్నేహితులు, యువతతో కలిసి రేవ్ పార్టీని ఏర్పాటు చేసి అశ్లీల నృత్యాలు చేస్తుండగా శంషాబాద్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీం పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం నలభై ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

రౌడీ షీట్ ఎత్తేసిన ఆనందంలో రేవ్ పార్టీ
ఇక ఈ కేసులో శంషాబాద్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఇక ఇంతకు ఏం జరిగిందంటే.. మైలార్ దేవ్ పల్లి కి చెందిన బాబు ఖాన్ అనే వ్యక్తి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న క్రమంలో పోలీసులు అతనిపై రౌడీషీట్ నమోదు చేశారు. ఇక చాలా కాలం తరువాత ఇటీవలే అతని మీద నమోదైన రౌడీషీట్ ను ఉన్నత అధికారులు తొలగించారు. ఇక ఈ సంతోషంలో తన స్నేహితులకు పార్టీ ఇవ్వాలని భావించిన బాబు ఖాన్, శంషాబాద్ రామాంజాపూర్ లోని సలీం వ్యవసాయ క్షేత్రంలో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు.

రేవ్ పార్టీపై పోలీసుల దాడి.. 48 మంది అరెస్ట్
ఇక అక్కడ రేవ్ పార్టీ జరుగుతున్న క్రమంలో తెల్లవారుజామున 3 గంటలకు పక్కా సమాచారంతో రేవ్ పార్టీ పై ఎస్వోటీ, శంషాబాద్ పోలీసులు దాడి చేశారు. ఇక రేవ్ పార్టీపై దాడి చేసిన పోలీసులు వారి వద్ద నుండి నాలుగు కత్తులు, ఐదు హుక్కాలు, 49 మొబైల్ ఫోన్లను, టూ వీలర్ లు, కార్ల ను స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్దనుండి 17,910 రూపాయల నగదును సీజ్ చేశారు. మొత్తం 48 మందిని అరెస్ట్ చేశారు. నలుగురు రౌడీషీటర్ లను, 44 మంది యువతీ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
శంషాబాద్ జోన్ ఎస్వోటీ పోలీసులు, శంషాబాద్ పోలీసులు కలిసి నిర్వహించిన ఈ దాడులలో రేవ్ పార్టీ లో పాల్గొన్న నలుగురు రౌడీషీటర్లు యాసీన్, మెహబూబ్, అజర్, సోహైల్ లుగా గుర్తించారు. విచారణ నిమిత్తం నిందితులను శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఇక ఈ ఫామ్ హౌస్ రౌడీషీటర్ ఎత్తివేసిన బాబు ఖాన్ కు సంబంధించిన ఫామ్ హౌస్ గా పోలీసులు గుర్తించారు. ఇక్కడ నలుగురు హిజ్రాలు కూడా పట్టుబడ్డారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications