హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.4 లక్షల ఫైన్.. రియల్టర్‌కు గట్టి షాక్.. ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

వాతావరణ మార్పులు.. వర్షాల లేమికి కారణం చెట్లు నరికివేయడమే కారణం.. దీనికి తోడు కాలుష్య కాసారం కావడానికి కూడా సరయిన మోతాదులో ప్లాంట్స్ లేకపోవడమే.. దీంతో ప్రభుత్వాలు మొక్కలు పెట్టడమే కాదు.. అదే లక్ష్యంతో పెంచుతున్నాయి కూడా.. కానీ కొందరికీ ఇవీ పట్టవు. తమ స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం.. ఇక రియల్టర్ల సంగతి చెప్పక్కర్లేదు. భూమి కనిపిస్తే చాలు అక్రమిస్తారు. చెరువుల పక్కన భూమిని ఆక్రమించేస్తారు. అలా భూమే కాదు.. అక్కడ ఉండే చెట్లను కూడా వదలడం లేదు. ఒకటి అరా చెట్లు అంటే ఏమో అనుకోవచ్చు.. కానీ ఓ రియల్టర్ 65 చెట్లను నరికేశారు.

అలా హైదరాబాద్ శివారులో రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన వ్యాపారికి భారీ జరిమానా తప్పలేదు. అటవీ శాఖ ఏకంగా నాలుగు లక్షల రూపాయల ఫైన్ విధించింది. అనుమతి లేకుండా చెట్లు నరికించారని చేసిన ఫిర్యాదుపై గట్టి చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలానికి చెందిన చిలుకూరులో ఓ స్థలం శుభ్రం చేయాలని అనుకున్నారు. అందులో భాగంగా ఆ స్థలంలో ఉన్న 65 చెట్లను అటవీ శాఖ పర్మిషన్ లేకుండానే నరికేశారు. ఇదీ నిబంధనలకు విరుద్దం.. వారి స్థలం అయినా అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది.

realtor penalised rs.4 lakh for cutting down 65 trees

స్థానికంగా ఉండే వారు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. సైట్ ను పరిశీలించినంత తర్వాత చెట్లు కొట్టేశారని నిర్ధారణకు వచ్చారు. సదరు రియల్టర్‌కు భారీగా జరిమానా విధించారు. మరొకరు ఇలా చేయడానికి భయపేడలా చేశారు. చెట్లను కొట్టొద్దు.. పెంచాలని ప్రభుత్వం నెత్తి నోరు బాదుకుంటుంది. అయినా కొందరు వినడం లేదు. తమ స్వార్థమే ముఖ్యం అని అనుకుంటున్నారు. ఇదీ చాలా సందర్భాల్లో రుజువు అయ్యింది. వాల్టా చట్టం ప్రకారం.. కంపెనీపై రూ.4 లక్షల ఫైన్ ను విధించారు అటవీశాఖ అధికారులు. అంతేకాకుండా అతను మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని స్పష్టంచేశారు. మరోసారి ఇలా చేయకుండా గట్టిగానే హెచ్చరించారు.

English summary
realtor penalised rs 4 lakh for cutting down 65 trees. incident happen at rangareddy district moinabad mandal chilkur village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X