హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ రెడ్డి పాదయాత్ర: అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, ఉమ్మడి 10 జిల్లాల గుండా

|
Google Oneindia TeluguNews

రేవంత్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంపై ఆలోచిస్తున్నారు. నేతలతో సమావేశాలు, శ్రేణులతో మంతనాలు.. అందరినీ కలుపుకొని పోతున్నారు. అధ్యక్ష పగ్గాలు స్వీకరించకన్నా ముందే.. బిజీగా మారారు. వచ్చేనెల 7వ తేదీన రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పగ్గాలు చేపడతారు. అయితే ఆ తర్వాత పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన రాకపోయినా.. జూలై సెకండ్ వీక్ నుంచి పాదయాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఆ వివరాలెంటో తెలుసుకుందాం. పదండి.

10 జిల్లాల నుంచి

10 జిల్లాల నుంచి

7వ తేదీన పగ్గాలు చేపట్టిన తర్వాత.. తన మార్క్ స్టైల్‌లో రేవంత్ రెడ్డి కార్యాచరణ ప్రారంభిస్తారు. సెకండ్ వీక్‌లో పాదయాత్ర ఉంటుందని సమాచారం. తేదీపై మాత్రం ఇప్పటివరకు ప్నఫ్టత లేదు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాదయాత్ర సుధీర్గంగా కొనసాగే ఛాన్స్ ఉంది. దాదాపు 12 నెలలపాటు కొనసాగుతుందని సమాచారం. పాత 10 జిల్లాల్లో గల ప్రతీ నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డి చుట్టివస్తారు. అక్కడ స్థానిక సమస్యలను కూడా తెలుసుకుంటారు.

ఒక్క ఛాన్స్ ప్లీజ్..

ఒక్క ఛాన్స్ ప్లీజ్..


పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ మరింత పెంచే ప్రయత్నం చేస్తారు. ఇదివరకు పాదయాత్ర చేస్తే.. అధికారం చేపట్టిన దాఖలాలు ఉన్నాయి. పార్టీలకు సీట్లు, గెలుపు జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి.. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనే అంశంపై క్లారిటీ ఇస్తారు. తెలంగాణ ఇచ్చింది తమ పార్టీయేనని రేవంత్ చెప్పే అవకాశం ఉంది. తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరతారు. పార్టీలో ఉన్న అసంతృప్తులను బుజ్జగించి.. అందరినీ రేవంత్ రెడ్డి కలుపుకుని పోతారు.

బండి సంజయ్ కూడా

బండి సంజయ్ కూడా

ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కన్నా ముందు.. పాదయాత్ర పూర్తి చేస్తారు. దీంతో జనాలకు పార్టీపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో.. తాను కూడా పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి అనుకున్నారు. తనకు గల ఫ్యాన్ ఫాలొయింగ్ క్యాష్ చేసుకోవాలని.. పార్టీ ఇమేజ్ మరింత పెరగాలని అనుకుంటున్నారు.

English summary
Revanth reddy padayatra to be start july second week sources said. padayatra continues on alampur to adilabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X