అంతటా అమలు చేయండి.. దళితబంధుపై రేవంత్ రెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ఉన్నందునే దళిత బంధు అమలు చేస్తున్నారని విమర్శించారు. మూడుచింతలపల్లిలో తెలంగాణ కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు రేవంత్‌. మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షకు జనం భారీగా కదిలివచ్చారు. మూడుచింతలపల్లి గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ దీక్షలో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా పాల్గొన్నారు

టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాటల తూటాలు కురిపించారు. ఏడేళ్ల పాలనలో రాష్ట్రంలోని దళిత, గిరిజన వర్గాలు దోపిడీకి గురయ్యారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు రేవంత్‌రెడ్డి. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే...ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.

 revanth reddy slams cm kcr

ఇదిలా ఉంటే మరోవైపు ఒకరికీ 4 ఎక‌రాల భూమి ఉంటే రైతుబంధు వ‌స్తుందని.... రైతుబంధు లాగే ద‌ళిత బంధు వ‌ర్తిస్తుందని చెప్పారు. ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు చివ‌రి వ‌రుస‌లో ఉండి తీసుకోవాలన్నారు. ద‌ళితజాతిలో కూడా భూమి, జాగ లేని వాళ్లున్నారు. నెత్తి మీద అప్పులు ఉన్నాయని వివరించారు. అలాంటి వారికి తొలి వ‌రుసలో ఇవ్వాలని కోరారు. అలా ఇచ్చుకుంటూ పోతామని.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ద‌ళితబంధు ఇచ్చే హామీ తనదన్నారు. రెండు పూట‌లు పస్తులుండే వాళ్లు ల‌క్ష‌ల మంది ఉన్నారని.. వారు ముందుగా తీసుకోవాలని కోరారు. అత్య‌ధికంగా జ‌నాభా ఉన్న కులం ఏది అంటే ఎస్సీలేనని చెప్పారు. 75 ల‌క్ష‌ల జ‌నాభా ఉందని.. అతి త‌క్కువ ఆస్తులు, భూములు ఉన్న వారు కూడా ఎస్సీలేనని చెప్పారు. ఇది ప్ర‌జాస్వామ్యం.. అయితే ప్ర‌జ‌లు ప్ర‌భువులు అయితే ద‌ళితులు ఎందుకు ప్ర‌భువులుగా లేరని ప్రశ్నించారు. ఈ వివ‌క్ష ఎన్ని శ‌త‌బ్దాలు కొన‌సాగాలని. ఇది సరికాదని సీఎం కేసీఆర్ చెప్పారు.

కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4996 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలకు మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో వర్తింప చేస్తారు.

Recommended Video

    Pcc chief Revanth Reddy said that CM KCR had lost his confidence | Oneindia Telugu

    దళిత బంధు పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+