Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సిఈఓ రేవతి అరెస్ట్

మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం నాడు బంజరాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మోజీ టీవీ స్టూడియోలో దళిత నేత హమారా ప్రసాద్ ను అవమానించారని ఆయన పెట్టిన కేసులో రేవతి ఏ2 గా ఉన్నారు. అయితే ఈ కేసులో తాము ఇచ్చిన నోటీసులకు రేవతి స్పందించలేదని పోలీసులు చెబుతున్నారు. అందుకే దీంతో శుక్రవారం ఉదయం ఆమెను బంజారాహిల్స్ పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

 మోజో టీవీ చర్చలో అవమానించారని కేసు పెట్టిన హమారా ప్రసాద్ .. మోజో మాజీ సిఈఓ రేవతి , యాంకర్ రఘులపై కేసు నమోదు

మోజో టీవీ చర్చలో అవమానించారని కేసు పెట్టిన హమారా ప్రసాద్ .. మోజో మాజీ సిఈఓ రేవతి , యాంకర్ రఘులపై కేసు నమోదు

శబరిమలై అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై 2019, జనవరి 24న మోజో టీవీలో చర్చ నిర్వహించారు. జాతీయ ఎస్సీ పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు నాగులరపు వరప్రసాద్ అలియాస్ హమారా ప్రసాద్ హాజరయ్యారు. చర్చలో యాంకర్ రఘు , వరప్రసాద్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఈ ఘర్షణలో వరప్రసాద్‌ను స్టూడియో నుంచి బయటకు పంపించారు.దళితుడైన తనను అవమానించారంటూ అప్పట్లోనే.. ఆయన బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు వరప్రసాద్. ఇక ఈ కేసులో మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని, న్యూస్ ప్రెజెంటర్ రఘును సైతం అదుపులోకి తీసుకున్నారు.

 ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసులో మోజో మాజీ సిఈఓ రేవతి అరెస్ట్ ...

ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసులో మోజో మాజీ సిఈఓ రేవతి అరెస్ట్ ...

రేవతి ఇంటికి వెళ్ళిన పోలీసులను ఎలాంటి వారంట్, నోటీసులు లేకుండా ఎందుకు వచ్చారని రేవతి వారించారు. వారితో పోలీస్ స్టేషన్ కు వెళ్ళటానికి నిరాకరించారు. సహకరించకుంటే అరెస్ట్ చేసి తీసుకెళ్ళాల్సి వస్తుందని పోలీసులు తేల్చి చెప్పారు. మోజో టీవీ లో సిఈఓ గా ఉన్న సమయంలో మోజో స్టూడియో లో చర్చకు పిలిచి హమారా ప్రసాద్ అనే దళిత నేతను అవమానించారని, ఆయన మీద యాంకర్ రఘు, సిఈఓ రేవతి దాడికి పాల్పడ్డారని ఆయన కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులోనే పోలీసులు రేవతిని అరెస్ట్ చేశారు. టీవీ9 నిధుల మళ్లింపు వ్యవహారంలో కూడా రేవతి రవి ప్రకాష్ కు సహకరించారని పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవల ఆమెను మోజో టీవీ యాజమాన్యం తొలగించటం జరిగింది. ఇక ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆమెను అరెస్ట్ చేశారు.

వారెంట్ లేకుండా బలవంతంగా తీసుకొచ్చారని ట్విట్టర్ లో పేర్కొన్న రేవతి

వారెంట్ లేకుండా బలవంతంగా తీసుకొచ్చారని ట్విట్టర్ లో పేర్కొన్న రేవతి

ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పలుమార్లు నోటీసులు పంపినా స్పందించలేదు. వీరు విచారణకు సైతం హాజరుకాకపోవటంతో జూలై 12వ తేదీన వారిద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు.తనను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకుని వచ్చారని రేవతి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తన కుమార్తెను స్కూల్ కు పంపాలని చెప్పినా , అలాగే తనకు డాక్టర్ అపాయింట్ మెంట్ ఉందని చెప్పినా పోలీసులు వినలేదని రేవతి ట్వీట్ చేశారు. ఇక తానేమైనా టెర్రరిస్ట్ నా అని ఆమె ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+