హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతు బంధు కొత్త జాబితాపై రెవెన్యూ శాఖ కసరత్తు.. లక్షన్నర మందికి అందని సాయం..?

|
Google Oneindia TeluguNews

బ్యాంకుల విలీనంతో రైతు బంధు నగదు జమ ఇబ్బందికరంగా మారింది. దీంతో కొత్త ఖాతా నంబర్, ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్ పుస్తకం అగ్రికల్చర్ అధికారి ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. దీనిని వ్యవసాయ ఖండించినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే రైతు బంధు కొత్త జాబితా తయారీలో రెవెన్యూ సిబ్బంది నిమగ్నం అయ్యారని తెలిసింది.

2018 వానాకాలంసీజన్ నుంచి రైతుబంధును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏడాదికి రెండు పంటల చొప్పున ఒక్కోపంటకు తొలిసారి ఎకరానికి రూ.4 వేలు ఇచ్చారు. 2019 వానాకాలం నుంచి ఎకరాకు రూ.5 వేలకు పెంచగా ఇప్పుడు ఏడాదికి రెండు పంటలకు కలిపి ఎకరాకు పదివేల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. 2018 నుండి ఈ ఏడాది మార్చి వరకూ 6 పంట సీజన్లకు మొత్తం రూ.35,911 కోట్లను ప్రభుత్వం జమ చేయగా ఈ ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి మొత్తం రూ.14,800 కోట్లు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది.

Revenue department is preparing the latest lists of raithu bandhu

గత యాసంగిలో 59,25,725 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయగా ఇప్పుడు రైతుల సంఖ్య 60 లక్షలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వచ్చే వానాకాలం, యాసంగి పంటలకు గాను రైతుబంధుకు అవసరమైన జాబితాను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది. వ్యవసాయ సిద్ధం చేసే రైతుల తాజా జాబితాలను రెవెన్యూశాఖ పరిశీలించి అక్కడ నుండి అవి జూన్ 10వ తేదీ వరకు జాతీయ సమాచార కేంద్రానికికి అందజేస్తుంది. అక్కడ నుండి నిధులు విడుదల చేస్తే అవి రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాలలో జమకానున్నాయి.

Recommended Video

Rythu Bharosa Kendras : AP CM Jagan Started RBK Channel

రాష్ట్రంలో లక్షన్నర మంది రైతులు సరైన పత్రాలు అందించక రైతు బంధు అందడం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే వారంతా సరి అయిన పత్రాలు అందించి సాయాన్ని పొందాలని కోరుతుంది. ఇన్నాళ్లు లేదు.. మరీ ఈ సారైనా వారికి వస్తాయో లేదో చూడాలీ మరీ.

English summary
telangana Revenue department is preparing the latest lists of raithu bandhu for 2021 season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X