హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖైరతాబాద్ గణేశ్: మట్టి ప్రతిమ, 80 రోజుల కృషి, రూ.కోటి ఖర్చుతో..

|
Google Oneindia TeluguNews

వినాయక చవితి వచ్చేస్తోంది. ఊరు, వాడ అంతా గణేశ్ ఉత్సవాలకు సంబంధించి పనుల్లో నిమగ్నం అయ్యారు. గణేశ్ విగ్రహాం అంటే ఖైరతాబాద్ పెట్టింది పేరు.. భారీగా ఉండటంతోపాటు.. ఏడాదికోసారి మంచి మేసెజ్ ఇస్తారు. ఇక్కడికి తాపేశ్వరం నుంచి లడ్డూ కూడా తీసుకొస్తారు. ఈ సారి కూడా వినాయకుడు కొలువుదీరనున్నారు. అయితే ఇదివరకటిలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి గణనాథుడి ప్రతిమను రెడీ చేశారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

రూ.కోటి ఖర్చు

రూ.కోటి ఖర్చు

మట్టి వినాయకుడి కోసం కూడా ఎక్కువే ఖర్చవుతుంది. 9 రాత్రులు ఆ గణనాథుడి సేవలో తరిస్తారు భక్తులు.. అయితే వర్షం కురిసి విగ్రహాం దెబ్బతినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం రూ. కోటి వరకు ఖర్చవుతుంది. మట్టి గణనాథుడిని రూపొందించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై నుంచి 50 నుంచి వంద మంది వరకు వస్తారు. మిగతా రాష్ట్రాల నుంచి కూలీలు వస్తారు.

1954లో ఫస్ట్ టైం

1954లో ఫస్ట్ టైం

1954లో శేఖరయ్య జీ అనే వ్యక్తి తొలుత గణేశ్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత ఒక్కో ఫీట్ ఎత్తు పెంచుకుంటూ వస్తున్నారు. 2015లో 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పటినుంచి హైట్ తగ్గించాలని అనుకుంది. కానీ భక్తుల నుంచి నిరసన రావడంతో వెన్కకి తగ్గింది. విగ్రహాలు నెలకొల్పి 68 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈసారి.. మట్టి వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించారు. ఈసారి 150 మంది కళాకారులు విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రాష్ట్రాలు.. ఒడిశా, తమిళనాడు, కోల్ కతా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ప్రతిమను తీర్చిదిద్దుతున్నారు.

80 రోజుల సమయం

80 రోజుల సమయం

జూన్ 1వ తేదీన పనులు ప్రారంభం కాగా.. 80 రోజుల తర్వాత ముగిశాయి. ఆగస్ట్ 31వ తేదీ నుంచి భక్తుల సందర్శనార్థం అనుమతి ఇస్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌ను ప్రత్యేక పూజల కోసం ఆహ్వానించామని కమిటీ సభ్యులు వివరించారు. ఖైరతాబాద్ గణేశుడిని సందర్శించుకునేందుకు భక్తులు బారులుతీరతారు. దర్శన సమయంలో ఇబ్బంది కలుగకుండా పోలీసు శాఖ తగిన ఏర్పాట్లు చేస్తోంది.

English summary
Khairatabad Ganesh idol is known for its height and is the tallest Ganesh idol this year Rs 1 crore will be spent on the preparation of idol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X