హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.35.81 కోట్ల ఫైన్.. మొత్తం 7.49 లక్షల కేసులు: డీజీపీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి మే 31వ తేదీ వరకు అయిన కేసుల వివరాలు, జరిమానా వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి తెలియజేశారు. కరోనా సమయంలో మందులు బ్లాక్ మార్కెట్ తరలించి.. సొమ్ము చేసుకునేవారిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ఔషధాల బ్లాక్ మార్కెట్‌పై 150 కేసులు నమోదయ్యాయని డీజీపీ పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 7.49 లక్షల కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు, రూ.35.81 కోట్ల జరిమానా విధించామని వెల్లడించారు. భౌతిక దూరం పాటించనందుకు 41,872 కేసులు నమోదు చేశామన్నారు.

Rs35.81 crores fine for not wear mask: dgp

జనం గుమిగుడినందుకు 13,867 కేసులు.. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. లాక్‌డౌన్‌ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నామని వివరించారు.

వేసవిలోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. అక్టోబర్‌లో థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు.

English summary
Rs35.81 crores fine for not wear a mask dgp mahender reddy said and 4.18 lakh cases are filed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X