ఉచిత కరెంట్ పేరుతో మోసం.. కేసీఆర్‌పై రాములమ్మ ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఫైర్ బ్రాండ్ రాములమ్మ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ చేయని మోసం లేదన్నారు. 24 గంటల ఉచిత కరెంటు పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. ప్రైవేటు కంపెనీలతో చేతులు కలిపి మార్కెట్ రేటు కంటే రెట్టింపు ధరకు కరెంటు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా కమీషన్లు దండుకుంటున్నారని ఆమె విమర్శించారు.
సిద్ధిపేట, గజ్వేల్, హైదరాబాద్ పాతబస్తీ వంటి ప్రాంతాల్లో కరెంటు బిల్లులు వసూలు చేయలేని పరిస్థితి ఉందన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం తన ఫాంహౌస్ కు 40 గ్రామాలకు ఉపయోగించేంత కరెంటును వాడుకుంటున్నారని విజయశాంతి మండిపడ్డారు. భద్రాద్రి పవర్ ప్లాంటు ఓ పెద్ద స్కాంలా మారిందని విమర్శించారు. బినామీ వ్యక్తులకు పవర్ ప్లాంటును అప్పజెప్పారని విమర్శించారు. దీంతో పెద్ద మొత్తంలో కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

సింగరేణి కార్మికుల డిపాజిట్లు డ్రా చేసి జీతాలు చెల్లించే స్థాయికి కేసీఆర్ దిగజారారని పేర్కొన్నారు. రామగుండంలో కేంద్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు పైగా నిధులతో ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానిని మూసివేసేందుకు కుట్ర చేస్తోందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే కాదు చాలా పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ విషయం చెప్పడం లేదన్నారు. కేంద్రం పేరు ఎత్తకుండా చూస్తోందని మండిపడ్డారు. జనాలకు ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే జరుగుతున్న అంశాలను చెబుతున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications