బీజేపీకి షాక్: కాంగ్రెస్ పార్టీలో చేరిన కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీగణేశ్
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు, కంటోన్మెంట్ ఉపఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరగనున్న కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో గట్టి అభ్యర్థిని బరిలో దించాలని కాంగ్రెస్ భావించింది. ఈ క్రమంలోనే గతంలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్ నారాయణన్ మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంటోన్మెంట్ నుంచి టికెట్ హామీ లభించడంతో శ్రీగణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ప్రజా బలం ఉన్న గణేశ్ ను తమ పార్టీలో చేర్చుకుని బరిలో దింపితే తమదే విజయమని కాంగ్రెస్ భావించినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి.. గణేశ్‌తో కలిసి మాట్లాడారు. టిక్కెట్ హామీ ఇస్తే వస్తానని గణేశ్ చెప్పారు. దీంతో ఆ మేరకు హామీ లభించడంతో మంగళవారం రాత్రి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ నివాసంలో మైనంపల్లి హనుమంతరావు, మహేందర్ రెడ్డి సమక్షంలో గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే, మంగళవారం మధ్యాహ్నం వరకు మల్కాజిగిరిలో బీజేపీ నేత ఈటల రాజేందర్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్న శ్రీగణేశ్.. అదే రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం బీజేపీ నేతలు విస్మయం చెందారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గణేశ్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సత్తా చాటుతుందని చెప్పుకొచ్చారు.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు లాస్య నందిత. అయితే, గత ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ క్రమంలో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన శ్రీణేశ్‌నే మరోసారి బరిలో దించాలని బీజేపీ భావించింది. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మరో అభ్యర్థిని బరిలో దించేందుకు బీజేపీ కసరత్తులు ప్రారంభించింది. మరోవైపు, బీఆర్ఎస్ తరపున సాయన్న మరో కూతురు నివేదిత తనకే కంటోన్మెంట్ టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే, దీనిపై బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
-
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
మూసీ తీరాన మహత్తరం -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
సికింద్రాబాద్-శ్రీకాకుళం ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications