సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, ఈ బైక్స్ షోరూమ్ యజమానిపై కేసునమోదు!!

సికింద్రాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనం కాగా, ప్రస్తుతం ఆసుపత్రిలో మరొకరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీంతో అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లుగా పోలీసు అధికారులు వెల్లడించారు.

ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య

ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య

సికింద్రాబాదులోని రూబీ ఫ్రైడ్ లగ్జరీ హోటల్లో సోమవారం రాత్రి భవనం కింది అంతస్తులో ఉన్నఎలక్ట్రిక్ బైక్ షోరూం లో పేలుడు సంభవించడంతో, మంటలు, పొగ పైన ఉన్న హోటల్ కు వ్యాపించి అందులో బసచేసిన టూరిస్ట్ లు మృతిచెందారు. ఇక సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై సిపి సివి ఆనంద్ స్పందించారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్టు వెల్లడించిన సివి ఆనంద్, ఫస్ట్ , ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నవారు ఊపిరాడక చనిపోయారని తెలిపారు.

అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రిక్ బైక్స్ షో రూమ్

ఇక పై నుండి క్రిందికి దూకిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయని, ప్రమాద సమయంలో రూబీ ప్రైడ్ హోటల్ లో 24మంది టూరిస్టులు ఉన్నట్టుగా వెల్లడించారు. మొత్తం నాలుగు ఫ్లోర్ లలో ఉన్న హోటల్ లో 23 రూమ్స్ ఉన్నాయని వెల్లడించారు. ఇక ఎటువంటి అనుమతులు లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు షోరూం నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా హోటల్ కలిగి ఉన్న భవన యజమానిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

హోటల్ కు ఫైర్ సేఫ్టీ లేదు, నిష్క్రమణకు ఒకే మార్గం

అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లాడ్జికి నాలుగు అంతస్తుల్లో ఉన్నవారికి ఒకే నిష్క్రమణ ఉందని, బయటకు రావడానికి వీలు లేక వారు చనిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక హోటల్ లోనూ ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదని గుర్తించారు. ఎలక్ట్రిక్ బైక్ షోరూం యజమాని రంజిత్ సింగ్ బగ్గా మరియు అతని ఇద్దరు కుమారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసామని తెలిపారు. ఇక ఈ కేసులో విచారణ కొనసాగుతుందని సిపి సివి ఆనంద్ వెల్లడించారు.

భవన యజమానిపై కేసు.. మృతుల వివరాలు సేకరిస్తున్న పోలీసులు


నిబంధనలకు విరుద్ధంగా హోటల్ బిల్డింగ్ లో, అనుమతులు లేకుండా గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలక్ట్రికల్ బైక్ ల వ్యాపారం నిర్వహిస్తున్న యజమాని రంజిత్ సింగ్ బగ్గా పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటివరకు మృతిచెందిన వారి వివరాలు విషయానికి వస్తే విజయవాడకు చెందిన ఏ హరీష్, చెన్నైకు చెందిన సీతారామన్, ఢిల్లీ వాసి వీతేంద్ర ఉన్నట్టు గుర్తించారు. ఇంకా మృతుల వివరాలను గుర్తించాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+