శంషాబాద్ 2 ..మృతిలో పురోగతి....అసుపత్రికని వెళ్లి శవంగా మారింది.మృతిపై అనుమానాలు

శంషాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ మరణంపై ఉత్కంఠ వీడకముందే దానికి సమీపంలోని శంషాబాద్‌లో మరో దారుణ సంఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే.... సిద్దులగుట్ట ప్రాంతంలోని మైసమ్మ దేవాలయం సమీపంలో గుర్తుతెలియని మహిళ మంటలకు అహుతి అయింది. 100 ద్వార సమాచారం అందుకున్న పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఎట్టకేలకు కేసును చేధించారు. మృతురాలు ఎవరో గుర్తించారు.

 మానసిక రోగిగా గుర్తింపు

మానసిక రోగిగా గుర్తింపు

సిద్దుల గుట్ట సమీపంలో శవంగా తేలిన మహిళ నగరంలోని అప్పర్ దూల్‌పేటకు చెందిన కవితాసింగ్‌గా గుర్తించారు. ఆమెకు ముగ్గురు సంతానం కూడ ఉన్నట్టు తెలుస్తోంది. కవితా సింగ్ భర్త సంతోష్‌సింగ్ రోజువారి కూలిపనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. కవితాసింగ్ గత కొద్ది రోజులుగా మానసిక వ్యాధితో బాధపడుతుందని ఆమె భర్త వివరించినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్టుగా చెప్పారు.

శుక్రవారం బయటకు వెళ్లిన కవితా సింగ్

శుక్రవారం బయటకు వెళ్లిన కవితా సింగ్


ఈనేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి వెళ్లివస్తానని చెప్పి ఒంటరిగానే బయటకు వెళ్లినట్టు చెప్పారు. గతంలో కూడ ఇలా ఒంటరిగా వెళ్లి తిరిగి వచ్చిందని వివరించారు. అయితే మూడు నెలల క్రితం మాత్రం ఆసుపత్రి చికిత్స కోసం వెళ్లి యాదగిరి గుట్టలో ప్రత్యక్షమైనట్టుగా పోలీసులు వివరించారు. శుక్రవారం కూడ అలాగే తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు భావించినట్టుగా చెప్పారు. చీకటి పడుతున్న తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త సంతోష్‌సింగ్ చుట్టుపక్కల ఇళ్లళ్లో వెతికాడు.

మీడియా వార్తలతో శంషాబాద్‌కు

మీడియా వార్తలతో శంషాబాద్‌కు

ప్రియాంక రెడ్డి మరణం తర్వాత అదే సమయంలో మరోమహిళ శవం కాలిపోతుందనే వార్తలను మీడియా ప్రసారం చేసింది. దీంతో సమాచారం అందుకున్న కవితాసింగ్ కుటుంబసభ్యులు హుటాహుటిన శంషాబాద్‌కు చేరుకున్నారు. కాలిపోయిన శవంతో పాటు సంఘటన స్థలంలో లభించిన ఆధారాలను బట్టి కవితాసింగ్‌గా గుర్తించామని చెప్పారు.
పోలీసులు కూడ పలు కొణాల్లో విచారించిన అనంతరం నిర్థారించారు.

పోలీసులు ఏమంటున్నారు...

పోలీసులు ఏమంటున్నారు...

శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం చేతిసంచి తీసుకుని కవితాబాయి శంషాబాద్‌కు చేరుకున్నారు. రాళ్లగూడ సమీపంలోని సిద్దేశ్వరస్వామి ఆలయం వద్ద ఏడుస్తూ తిరిగారు. అయితే ఇదంగా సీసీ ఫుటేజీలో నమోదైనట్టు చెప్పారు. అనంతరం దేవాలయం సమీపంలో ఆమె అనుమానస్పదంగా మంటల్లో చిక్కుకుని దహనమైందని చెప్పారు.

హత్య..ఆత్మహత్యా....?

హత్య..ఆత్మహత్యా....?

అయితే కవితాసింగ్ తానే నిప్పంటించుకుందా... లేక ఎవరైన అత్యాచారం చేసి నిప్పంటించారా అనే అనుమానాలు ఉన్నాయి. దీంతోపాటు శంషాబాద్ వైపు ఎలా వెళ్లింది. గతంలో ఎప్పుడైనా వెళ్లిందా...? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. మొత్తం మీద మృతురాలిపై అత్యాచారం జరిగిందా లేదా.. అనే దానిపై స్పష్టత పోస్టుమార్టం రిపోర్టు తర్వాతే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+