Hyderabad: హైదరాబాద్‍లో కిడ్నాప్ కలకలం..! బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి అదృశ్యం..

రాష్ట్రంలో ఓ రాజకీయా నాయకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరిని గుర్తి తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు శరణ్ చౌదరి బయటకు వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కారులో ఎక్కినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శరణ్ చౌదరి ఫోన్ స్వీచ్ఛాఫ్ అయింది.

కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. అటు డ్రైవర్ కు ఫోన్ చేస్తే అతని ఫోన్ కూడా స్వీచ్ఛాఫ్ వస్తుంది. దీంతో ఆందోళ చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త కనిపించడం లేదని శరణ్ చౌదరి భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా శరణ్ చౌదరి కూకట్ పల్లి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాట్లు తెలుస్తోంది.

Hyderabad:

పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కేసు విచారణ చేస్తున్నారు. శరణ్ చౌదరి ఫోన్, డ్రైవర్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని గుర్తించడం ఇబ్బందిగా మారింది. మరోవైరు శరణ్ చౌదరి అదృశ్యంపై బీజేపీ నేతలు పోలీసులతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+