మటన్ కూర, నిద్రలేని రాత్రి.. చర్లపల్లి జైలులో దిశ హత్య కేసు నిందితుల ఫస్ట్ డే..

వెటర్నరీ వైద్యురాలు దిశపై సాముహిక లైంగికదాడి చేసి.. హతమార్చిన నిందితులు మహ్మద్, చెన్నకేశవులు, నవీన్, శివ మొదటిరోజు జైలులో నిద్రలేని రాత్రి గడిపారు. దిశ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటడంతో వారి వెన్నులో వణుకు మొదలై.. ఉంటుంది, అందుకే నిద్రపోలేరని జైలు అధికారులు పేర్కొన్నారు.

హై సెక్యూరిటీ బ్యారక్

హై సెక్యూరిటీ బ్యారక్

నలుగురు నిందితులు చర్లపల్లి హై సెక్యూరిటీ బ్యారక్‌లో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. జైలు నిబంధనల ప్రకారం వారికి ఆహారం అందించారు. మధ్యాహ్నాం పప్పుతో అన్నం, రాత్రి మటన్ కూరతో భోజనం పెట్టారు. భోజనం చేసిన నిందితులు.. రాత్రి మాత్రం నిద్రపోలేరని అధికారులు తెలిపారు.

నిద్రలేని రాత్రి

నిద్రలేని రాత్రి

నిందితులు నలుగురిని రాత్రంతా నిశీతంగా పరిశీలించామని అధికారులు పేర్కొన్నారు. జైలులో మొదటిరోజు రాత్రి నిద్రపోలేరని వెల్లడించారు. వారంతా మానసికంగా బాగున్నారని.. ప్రవర్తనలో ఏమి తేడాలేదని అధికారులు పేర్కొన్నారు.

దద్దరిల్లిన పార్లమెంట్

దద్దరిల్లిన పార్లమెంట్

వెటర్నరీ డాక్టర్ దిశ లైంగికదాడి, హత్య పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. సభ ప్రారంభం కాగానే దిశ అంశంపై చర్చించాలని సభ్యులు పట్టుబట్టారు. ఘటనపై పార్టీల వారీగా నేతలు స్పందించారు. దిశ ఘటనపై ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో గళమెత్తారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల సూచనమేరకు మరింత కఠిన చట్టాలు అమలుచేస్తామని కేంద్రం సభలో ప్రకటించింది.

అమానుషం..

అమానుషం..

దిశ అమానుష ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో మాట్లాడారు. వెటర్నరీ డాక్టర్ హత్య బాధాకరమని అభిప్రాయపడ్డారు. దిశ హత్యను యావత్ దేశం ఖండిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. నిందితులను వదిలిపెట్ట ప్రసక్తే లేదని సభలో తేల్చిచెప్పారు. కఠిన శిక్ష విధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. నిర్భయ తర్వాత మరింత కఠిన చట్టాలు చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+