Crime News: కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకిన మహిళ.. ఇంకా లభించని ఆచూకీ..
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న స్వప్న అనే మహిళ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆమె మృతదేహం కోసం దుర్గం చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి స్వప్న దుర్గం చెరువులోకి దూకింది. యువతి దూకడాన్ని గమనించిన దుర్గం చెరువుకి వచ్చిన సందర్శకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్పీడ్ బోట్స్, డీఆర్ఎఫ్ సిబ్బంది
యువతి మృత దేహం కోసం ఘటన జరిగినప్పటి నుంచి గాలించినా ఆచూకీ దొరకలేదు. గురువారం మృతదేహం కోసం మరోసారి గాలించారు. మరోసారి స్పీడ్ బోట్స్, డీఆర్ఎఫ్ సిబ్బందితో పోలీసులు గాలించారు. అయితే చెరువులో బురద ఎక్కువగా ఉండడంతో మృతదేహం బురదలో చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మానసిక స్థితి
అయితే యువతి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, డిప్రెషన్ కు లోను కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపారు. భర్తతో విడాకులు తీసుకొని 6 నెలలుగా దూరంగా ఉంటుంది స్వప్న. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు గతంలో చికిత్స చేయించారు.

దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య..
కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.కేబుల్ బ్రిడ్జి వద్ద ఆత్మహత్యలను అడ్డుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు వాచ్ టవర్ కూడా ఏర్పాటు చేశారు. కానీ పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ చేసినట్టు కనిపించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications