Hyderabad: దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల కేసు దోషి సయ్యద్ మక్బూల్ మృతి..
2013 దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల కేసులో దోషి అయిన నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కి చెందిన సయ్యద్ మక్బూల్ అలియాస్ జుబైర్ మృతి చెందాడు. చర్లపల్లి సెంట్రల్ జైలులో చికిత్స పొందుతూ జూలై 25, గురువారం మరణించాడు. అతని వయస్సు 44 సంవత్సరాలు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన మక్బూల్ 2013లో దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో దోషిగా తేలాడు. ఈ బాంబు పేలుళ్లో 18 మంది మృతి చెందారు. 130 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో సయ్యద్ మక్బూల్ జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు.
పాకిస్తాన్‌లో ఉన్న రియాజ్ భత్కల్‌తో పాటు భారతదేశంలోని ఇతర కార్యకర్తలతో సహా ఉన్నత స్థాయి IM సభ్యులతో అతనికి బలమైన సంబంధాలు ఉన్నాయని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఆరోపించింది. హైదరాబాద్‌ను లక్ష్యంగా చేసుకుని ఐఎం దేశవ్యాప్తంగా పలు దాడులకు పథకం వేసింది. 2013లో అరెస్టు చేయగా, 2023 అక్టోబర్‌లో ఢిల్లీ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.

అతనికి శిక్ష ఖరారు అయిన తరువాత, తెలంగాణలోని కేసులకు సంబంధించిన శిక్షను అనుభవించడానికి నవంబర్‌లో చర్లపల్లి జైలుకు తరలించారు. ఫిబ్రవరి 21, 2013న, భారతదేశంలోని హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి.
రద్దీగా ఉండే షాపింగ్ ఏరియాలో పేలుళ్లు జరిగాయి. ఆనంద్ టిఫిన్స్ సమీపంలో రాత్రి 7:02 గంటలకు మొదటి బాంబు పేలింది. రెండు నిమిషాల తర్వాత వెంకటాద్రి థియేటర్‌కు సమీపంలో దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ సమీపంలో రెండో పేలుడు సంభవించింది.
ఈ బాంబులను ఇనుప మేకులు, బోల్ట్‌లు, అమ్మోనియం నైట్రేట్‌తో ప్యాక్ చేసిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (IEDలు)గా గుర్తించారు. పేలుడు జరిగిన ప్రదేశంలో పార్క్ చేసిన సైకిళ్లపై పేలుడు పదార్థాలను ఉంచినట్లు దర్యాప్తులో తేలింది. బాంబులు అమర్చినట్లు భావిస్తున్న ఐదుగురు వ్యక్తులను సీసీటీవీ ఫుటేజీలో గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. యాసిన్ భత్కల్‌తో సహా ఇండియన్ ముజాహిదీన్‌లోని కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. బాంబు పేలుళ్లలో ప్రధాన పాత్రదారులకు మరణశిక్ష విధించారు. 2016 డిసెంబర్‌లో పేలుళ్లకు సంబంధించిన ఇతర ఆరోపణలపై ప్రత్యేక కోర్టు భత్కల్‌తో పాటు మరో నలుగురికి మరణశిక్ష విధించింది.












Click it and Unblock the Notifications