నామినేషన్ ర్యాలీలో డీజే.. పాల్గొన్న మంత్రి తలసాని.. కేసు నమోదు చేసిన పోలీసులు
గ్రేటర్ నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే ర్యాలీ తీసే సమయంలో నియమ, నిబంధనలను ఈసీ అధికారులు స్పష్టంచేశారు. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్న ర్యాలీలో ఏకంగా డీజే ఉపయోగించారు. దీనిపై ఈసీ కన్నెర్ర చేసింది. నిబంధనలను అతిక్రమించడంతో కేసు నమోదు చేశారు. ప్రచారానికి సంబంధించి కూడా నిబంధనలు ఉల్లంఘించొద్దు అని సూచిస్తున్నారు.
బల్దియాలో నామినేషన్ వేయడానికి ఇవాళే చివరి రోజు అనే సంగతి తెలిసిందే. బేగంబజార్ టీఆర్ఎస్ అభ్యర్థి పూజా వ్యాస్ బిలాల్ నామినేషన్ వేసే ముందు ర్యాలీ తీశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. అయితే ర్యాలీలో డీజే ఉపయోగించారు. వాస్తవానికి డీజేలకు అనుమతి లేదు. దీంతో షాహీనాయత్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అతిక్రమించడంతో కేసు ఫైల్ చేశామని చెప్పారు.

అంతేకాదు గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు 10 వేల 777 పోస్టర్లు, ప్లెక్సీ, బ్యానర్లు తొలగించామని చెప్పారు. అనధికార ప్లెక్సీ, బ్యానర్ల తొలగింపు కోసం 20 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వారు మూడు షిప్టుల్లో పనిచేస్తున్నారని.. నిబంధనలు అతిక్రమిస్తే తీసివేస్తున్నారని పేర్కొన్నారు.
Recommended Video
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయ దుందుబి మోగించడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. బల్దియాలో విజయం సాధించి.. ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగు వేస్తోంది. మరీ ప్రజలు ఏ వైపు నిలుస్తారో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications