Gaddar-Chandrababu: గద్దర్‍పై కాల్పులు జరగడంపై చంద్రబాబు ఏమన్నారంటే..!
టీడీపీ అధినతే నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రజా యుద్ధనౌక గద్దర్ కుటుంబాన్ని పరామర్శించారు. హైదరాబాద్ అల్వాల్ లోని గద్దర్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు గద్దర్ ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. గద్దర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. గద్దర్ కు భయమంటే తెలియదని చంద్రబాబు అన్నారు. పోరాటాలే ఆయన ఊపిరిగా బతికారాని కొనియాడారు. గద్దర్ మృతి చాలా బాధకరమని చెప్పారు.
గద్దర్ ఆత్మకు శాంతి చేరుకూరాలని కోరుకున్నారు. గద్దర్ లేకపోయినా ఆయన స్ఫర్తి శాశ్వతంగా ఉంటుందని తెలిపారు. గద్దర్ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చేరేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. 1997లో గద్దర్ పై కాల్పులు జరగడంపై తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు సీబీఎన్ అన్నారు.
ఆ కాల్పుల తర్వాత గద్దర్ తనను చాలా సార్లు కలిసినట్లు చంద్రబాబు గుర్తు చేస్కున్నారు. ఇద్దరం కలిసి పని చేసినట్లు చెప్పారు. తన లక్ష్యం.. గద్దర్ లక్ష్యం ఒకటేనని చంద్రబాబు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గద్దర్ అవార్డులు అందజేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. ట్యాంక్ బండ్ పై గద్దరి విగ్రహం పెడతామని అన్నారు. గద్దర్ తెలంగాణ ప్రైడ్ , లెజెండ్ అని తెలిపారు. గద్దర్ బతికి ఉన్నప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిందని పేర్కొమన్నారు.












Click it and Unblock the Notifications