హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాళ క్యాబినెట్ భేటీ.. హుజురాబాద్ బై పోల్.. దళిత బంధుపైనే చర్చ..?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కేబినెట్‌ ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రగతి భవన్‌లో జరిగి సమావేశంలో దళితబంధు, చేనేత, దళిత బీమాపై చర్చించనుంది. హుజూరాబాద్‌ అభివృద్ధిపై మంత్రివర్గం సమీక్షించనుంది. వర్షాలు, వ్యవసాయం, ఇరిగేషన్‌పైనా సమావేశంలో డిస్కష్ చేస్తారు.దళిత బంధు పథకం, అమలు గురించి ప్రధాన చర్చ జరగనుంది.

Recommended Video

Ponnala Lakshmaiah again fired at kcr for deceive Dalits in the name of Dalit bandhu.
దళితబంధు..

దళితబంధు..

కరోనా థర్డ్‌వేవ్‌ వస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించనుంది. అర్హులకు దళితబంధు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించడానికి తేదీలను ఖరారు చేయనుంది. ఎంత మంది అర్హులు ఉన్నారు? దళితవాడల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అనే అంశంపై అధికారులు పూర్తిస్థాయిలో సమాచారం సేకరించారు. ఆ అంశంపై కేబినేట్‌లో చర్చించనున్నారు. దళిత బీమా, చేనేత బీమాలపై కూడా ఆ సమావేశంలో చర్చించనున్నారు.

ఉద్యోగాల భర్తీ..

ఉద్యోగాల భర్తీ..

రాష్ట్రంలో 50వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ ప్రతిపాదనను మంత్రివర్గ సమావేశం ఉంచనుంది. గత కేబినెట్‌లో శాఖల వారీగా ఉన్న ఖాళీల లెక్కల్లో గందరగోళం ఉండటంతో.. మరోసారి కేబినెట్‌కు ఆ వివరాలను ఆర్థికశాఖ అందించనుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై కూడా కేబినేట్‌ చర్చించనుంది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు పంటలకు సాగునీరు ఇచ్చే అంశంపై చర్చలు జరగనున్నాయి. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై మంత్రులు చర్చించనున్నారు.

లేఖల అంశం..

లేఖల అంశం..

గోదావరి బోర్డు లేఖపై కూడా సమావేశంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తలపై కూడా కేబినేట్ ఫోకస్ పెట్టనుంది. కేరళలో రెండురోజులు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు అవుతుంది. దానిని దృష్టిలో ఉంచుకొని థర్డ్‌ వేవ్‌పై అప్రమత్తం అయ్యింది. కొత్త ఆసుపత్రుల నిర్మాణంపై చర్చించే ఛాన్స్‌ ఉంది. ఆక్సిజన్ బెడ్స్ సిద్ధంగా ఉంచడంతోపాటు కోవిడ్ వార్డ్స్ మందుల కొరత లేకుండా చూడటం లాంటి అంశాలపై మంత్రివర్గం దృష్టిసారించనుంది.

English summary
telangana cabinet meet today 2pm at pragathi bhavan, they may discus huzurabad by poll 2021 and dalitha bandhu other schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X