• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ ఫైర్‌బ్రాండ్ ఐపీఎస్ అధికారికి పంజాబ్‌ ప్రభుత్వంలో బంపర్ ఆఫర్: సలహాదారుగా

|

హైదరాబాద్: తెలంగాణలో ఫైర్‌బ్రాండ్ ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందిన వినోయ్ కుమార్ సింగ్‌ (వీకే సింగ్)కు పంజాబ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆయనను సలహాదారుగా నియమించింది. ప్రస్తుతం వీకే సింగ్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. ఇదివరకే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు జూన్ 24వ తేదీన వీఆర్ఎస్ దరఖాస్తు, ఓ లేఖను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించారు.

తెలుగు రాష్ట్రాలను వెంటాడుతోన్న అగ్నిప్రమాదాలు: ఈ సారి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో

ప్రభుత్వానికి భారం కాదలచుకోలేదంటూ

ప్రభుత్వానికి భారం కాదలచుకోలేదంటూ

అదే సమయంలో ఆయనను పంజాబ్ ప్రభుత్వం సలహదారుగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం పనితీరుపై వీకే సింగ్ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన సర్వీస్‌ పట్ల ప్రభుత్వం సంతృప్తికరంగా లేదని తాను భావిస్తున్నట్లు ఆయన తన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదనీ చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి తాను భారం కాదలచుకోలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజున తనకు పదవీ విరమణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

వీఆర్ఎస్ కోసం దరఖాస్తు..

వీఆర్ఎస్ కోసం దరఖాస్తు..

నిజానికి ఆయన సర్వీసు కాలం ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ నాటికి పూర్తవుతుంది. స్వచ్ఛంద పదవీ విరమణ కోరాలంటే మూడు నెలలకు ముందే నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలో భాగంగా ఆయన వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 1987 బ్యాచ్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన అధికారి ఆయన. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ కేడార్ కిందికి వెళ్లిపోయారు. ప్రస్తుతం పోలీస్ అకాడమీ డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి..

తెలంగాణ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి..

ఐపీఎస్ అధికారిగా గొప్ప ఆశయాలతో పోలీస్‌ శాఖలో చేరానని, పోలీసింగ్‌లో సమూల మార్పులను తీసుకుని రావాలనే లక్ష్యంతో పనిచేశానని అన్నారు. ఆ ప్రయత్నాల్లో తాను విఫం అయ్యానని, తన చర్యలు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయని అంటూ వీకే సింగ్ అప్పట్లో రాసిన లేఖ పెను సంచలనం సృష్టించింది. ప్రభుత్వం కూడా అసమర్థులను భరించాల్సిన అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

డీజీపీగా పదోన్నతి కోసం

డీజీపీగా పదోన్నతి కోసం

వీఆర్ఎస్ కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేయడానికి కొద్దిరోజుల ముందు ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. పదోన్నతి విషయంలో తనకు అన్యాయం జరుగుతోందనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 1987 బ్యాచ్‌కు చెందిన తనకు అర్హత ఉన్నా ఇప్పటి వరకు డీజీపీగా పదోన్నతి ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని ఆయన విజ్ఙప్తి చేశారు. తాను పదోన్నతికి అర్హుడిని కాదని భావించి, ఆ విషయం చెప్తే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తానని కూడా లేఖలో పేర్కొన్నారు.

  RGV 'మర్డర్' సినిమా కి ఝలక్ .. రిలీజ్ వాయిదా | Ram Gopal Varma | Oneindia Telugu
  పంజాబ్ జైళ్లశాఖ సలహాదారుగా..

  పంజాబ్ జైళ్లశాఖ సలహాదారుగా..

  వీకే సింగ్‌ను పంజాబ్ ప్రభుత్వం సలహాదారుగా నియమించుకుంది. జైళ్ల శాఖ సలహాదారుగా నియమించింది. జైళ్ల అభివృద్ధి, ఆధునికీకరణ వంటి అంశాలపై ఆయన పంజాబ్ పోలీసుశాఖకు మార్గదర్శకత్వం చేయాల్సి ఉంటుంది. జైళ్ల ఆధునికీకరణ, పటిష్టమైన భద్రతా వ్యవస్థ కోసం ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం కొన్ని కీలక చర్యలను చేపట్టింది. వీకే సింగ్‌తో పాటు రోహ్‌తక్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ధీరజ్ శర్మను సలహాదారుగా నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కిందటినెలలోనే విడుదల అయ్యాయి.

  English summary
  Telangana cadre IPS Officer and Director General of Telangana State Police Academy VK Singh have appointed as advisor of Department of Jails in Punjab government. VK Singh already sent his resignation to the Central government.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X