హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ రూపోందించడి : సీఎం కేసిఆర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. దేశావ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఈనేపథ్యంలోనే గత మార్చిలో ఓట్ ఆన్ ఆకౌంట్ రూపంలో బడ్జెట్‌ను 2019-20 ఆర్ధిక బడ్జెట్‌ను త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశ పెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Telangana CM KCR is working on the state budget.

ఈ నేపధ్యంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదాయం తగ్గిందని చెప్పిన ఆయన ఆర్ధిక మాంద్యానికి పలు రంగాలపై ప్రభావం పడిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఆదాలయాలు బాగా తగ్గిపోయాయని చెప్పారు. ఈనేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని ఆదాయాలతో పాటు అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. రానున్న బడ్జెట్ పూర్తిగా వాస్తవ రూపంలో ఉండాలని చెప్పిన ఆయన వ్యవసాయం, ప్రజాసంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కాగా పూర్తి స్థాయి రూపకల్పనపై మంగళవారం కూడ చర్చ జరగనుంది. దీనిపై పూర్తిస్థాయి కసరత్తు జరిగిన తర్వాత మంత్రివర్గం ఆమోదం తీసుకుని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

English summary
Telangana CM KCR is working on the state budget. In the wake of the economic downturn across the country, the state budget should be designed to suit the real situation he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X