హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌‌‌వాసుల కోసం మరో మెగా ప్రాజెక్ట్ - శంకుస్థాపన చేయనున్న కేసీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. వచ్చే సంవత్సరం నవంబర్-డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. దీనితో అక్కడి రాజకీయ వాతావరణం ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. అధికార టీఆర్ఎస్.. ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెడుతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం.

ఇందులో భాగంగా- ముఖ్యమంత్రి కేసీఆర్.. మరో మెగా ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఉద్దేశించిన ప్రాజక్ట్ ఇది. డిసెంబర్ 9వ తేదీన శంకుస్థాపన చేయనున్నారాయన. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ మలిదశ విస్తరణలో భాగంగా దీన్ని చేపట్టారు. ఇది అందుబాటులో వస్తే- ట్రాఫిక్ సమస్యల సుడిగుండం నుంచి వాహనదారులకు మరింత ఊరట లభించినట్టవుతుంది.

Telangana CM KCR will be laying the foundation for Airport Express Metro on December 9

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా- కొత్తగా ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోను నిర్మించ తలపెట్టారు కేసీఆర్. ఐటీ హబ్‌గా గుర్తింపు ఉన్న గచ్చిబౌలి-మాదాపూర్-కొండాపూర్-మైండ్ స్పేస్ టెక్నాలజీ పార్కులకు రాకపోకలు సాగించడానికి వీలుగా దీన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ఆయా ప్రాంతాల నుంచి మెట్రో రైలు ద్వారా అతి తక్కువ సమయంలో నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా విలువ 6,250 కోట్ల రూపాయలు. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు దీన్ని నిర్మించ తలపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మైండ్ స్పేస్ జంక్షన్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మధ్య 31 కిలోమీటర్ల మేర నిర్మాణాన్ని పూర్తి చేసుకోనుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

English summary
Telangana CM KCR will be laying the foundation for Airport Express Metro on December 9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X