కేంద్రంలో యూపిఏ వస్తానే... తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది...జగ్గారెడ్డి
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడు. తన భవిష్యత్ రాజకీయం లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుయనుందని స్పష్టం చేశారు.అయితే ఇప్పటికే కేసీఆర్ , కేటీఆర్ బంధువులు ఆయన్ను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత గాంధిభవన్ లో ఉంటానో లేక తెలంగాణ భవన్‌లో ఉంటానో తేలిపోతుందని అన్నారు.

మరోవైపు కేంద్రంలో యూపిఏ అధికారంలోకి వస్తేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతికి బట్టకడుతుందని తెలిపారు. ఇక మే 30లోపు కేసీఆర్ బంధువులు మళ్లీ కలిస్తే అప్పుడు ఏ పార్టీలో ఉండాలనే నిర్ణయం చెబుతానని అన్నారు. ఇక తాను పార్టీల జెండాపై గెలిచిన నేతను కాదని స్వశక్తితో ఎదిగానని చెప్పారు. ఈనేపథ్యంలోనే పార్టీ మాట పూర్తిగా వినని సగం విని మిగతా సగం నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications