వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు హైకోర్టు ఓకే: సిద్ధమైన ప్రభుత్వం
హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు హైకోర్టులో అనుమతి లభించింది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ వినతి మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై గురువారం విచారణ జరిపింది.
రిజిస్ట్రేషన్ కోసం ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకునే విధానానికి అనుమతిచ్చింది. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య ఖచ్చితంగా ఉండాలన్న నిబంధనకు కోర్టు సమ్మతించింది. రిజిస్ట్రేషన్ల సమయంలో ఆధార్, కులం, కుటుంబసభ్యుల వివరాలు అడగబోమని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది.

రిజిస్ట్రేషన్లు ఆపాలని ఎప్పుడూ స్టే ఇవ్వలేదని విచారణ సందర్భంగా మరోసారి హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేగాక, ధరణిపై ఇవాళ మరో ఐదు అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ బీఎన్ ప్రసాద్ హైకోర్టును గడువు కోరారు. దీంతో విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది కోర్టు.
రెడీగా ప్రభుత్వం
హైకోర్టు అనుమతి లభించడంతో శుక్రవారం నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీనిపై సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications