హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఏస్‌ల కోసం కోట్ల ఖర్చు... అయినా మీరు ఏంచేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

డెంగ్యూ వ్యాధి నివారణకు తీసుకోవడంలో తెలంగాణ అధికారులు విఫలం అయ్యారని రాష్ట్ర హైకోర్టు ఐఏఎస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు రాష్ట్రంలో ఎం జరుగుతుందో తెలుసుకునేందుకు కూడ కనీసం ఆసక్తి చూపించడం లేదని చెప్పింది. ఇందులో భాగాంగా డెంగ్యూ వ్యాధిగ్రస్తులను పట్టించుకోకపోతే అధికారులపై సుమోటో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఈనేపథ్యంలోనే డెంగ్యూను నివారించండి లేదంటే భాదితులకు 50 లక్షల రుపాయల పరిహారం ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.

 కోర్టు ముందు హజరైన సీఎస్ ఇతర ఐఏఎస్‌లు

కోర్టు ముందు హజరైన సీఎస్ ఇతర ఐఏఎస్‌లు

డెంగ్యూ మరణాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగానే బుధవారం విచారణ జరిపిన హైకోర్టు విచారణకు ఉన్నతాధికారులు హజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గురువారం నాడు విచారణ జరగడంతో సీఎస్ జోషీతోపాటు ప్రభుత్వ అదనపు కార్యదర్శులు, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు కోర్టుముందు హజరయ్యారు. వారిలో అరవింద్ కుమార్ , లోకేష్ కుమార్ , శాంత కుమారి , యోగితా రాణాలు ఉన్నారు.

తెలంగాణలోనే డెంగ్యూ ఎందుకు ప్రబలుతోంది

తెలంగాణలోనే డెంగ్యూ ఎందుకు ప్రబలుతోంది

డెంగ్యూవ్యాధికి కారణమైన దోమల నివారణపై తీసుకుంటున్న చర్యలపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల్లో లేని డెంగ్యూ వ్యాప్తి తెలంగాణాలోనే ఎందుకు వ్యాప్తి చెందుతుందని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్‌తో పాటు రాజస్థాన్‌లు కూడ నదీ మధ్యలోనే నిర్మాణం జరిగాయని అలాంటప్పుడు ఆయా రాష్ట్రాల్లోని డెంగ్యూ తెలంగాణలో ఎందుకు వ్యాప్తి చెందుతుందని ప్రశ్నించింది.

తెలంగాణలో 3800 డెంగ్యూ కేసులు

తెలంగాణలో 3800 డెంగ్యూ కేసులు

మరోవైపు రాష్ట్రంలో 3800 డెంగ్యూ కేసులు నమోదు అయితే... ప్రభుత్యం మాత్రం అతి తక్కువ కేసులు నమోదైనట్టు చూపెడుతుందని అన్నారు. ఇక రోజురోజుకు డెంగ్యూ రాష్ట్రంలో విస్తరిస్తుందని వ్యాఖ్యానించింది. గత జనవరి నెలలో 85 డెంగ్యూ కేసులు నమోదు అయితే ఆక్టోబర్ నెలనాటికి 3800 కేసులకు ఎలా పెరిగాయని ప్రశ్నించింది. దీంతో డెంగ్యూ వ్యాధిని నివారణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పింది. దీంతో డెంగ్యూను నివారించండి లేదంటే బాధితులకు 50 లక్షల రూపాయల నష్టపరిహరం చెల్లించాలని చెప్పింది.

 ఐఏఎస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు

ఐఏఎస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు

కోర్టు ప్రశ్నలకు ఐఏస్‌ అధికారులు జవాబులు చెబుతున్న సంధర్భంలో కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్‌లను తయారు చేసేందుకు కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెడితే... సామాన్య ప్రజలకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీంతోపాటు తెలంగాణ ఐఏఎస్‌లు దేశపౌరులు కారా అంటూ మండిపడింది. కోర్టు ఆదేశాలు పాటించకుంటే ఐఏఎస్‌పై సుమోటో కేసుటు నమోదు చేయడంతో పాటు డెంగ్యూవ్యాధిన పడి మృతి చెందిన కుటుంభాలకు వ్యక్తిగత అకౌంట్‌ల నుండి 5లక్షల రూపాలయను చెల్లించాల్సి ఉంటుందని స్ఫష్టం చేసింది.ఐఏఎస్ ల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరువస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.

English summary
Telangana IAS officials fail to control dengue and they are not taking any actions to reduce high court said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X