తెలంగాణ హాట్‌స్పాట్స్: జీహెచ్ఎంసీలో కరోనా కల్లోలం: 43 వేలకు పైగా: జిల్లాల్లో అదే తీరు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కల్లోల పరిస్థితులు యధాతథంగా కొనసాగుతున్నాయి. పాజిటివ్ కేసుల తీవ్రత ఎప్పట్లాగే కొనసాగుతోంది. రోజువారీగా నమోదుతోన్న కరోనా కేసుల సంఖ్యలో స్పల్పంగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయే తప్ప భారీగా తగ్గట్లేదు. మరోసారి రెండు వేలకు చేరువగా కరోనా పాజిటివ్ రోజువారీ కేసులు రికార్డు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సహా దానికి ఆనుకుని ఉండే జిల్లాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1931 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 11 మంది మరణించారు. 1780 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 86,475కు చేరుకుంది. ఇందులో 63,074 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 665కు పెరిగింది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 22,736గా నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే బులెటిన్‌ను విడుదల చేసింది.

Telangana: Newly 1931 Covid19 positive cases and 11 deaths reported in last 24 hours

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గట్లేదు. ఎప్పట్లాగే పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో జీహెచ్ఎంసీ పరిధిలో 298 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. ఈ మధ్యకాలంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్యలో కొద్దిగా తగ్గుదల కనిపించింది. అంతే తప్ప ఆశించిన స్థాయిలో కరోనా కేసుల తీవ్రతలో క్షీణత నమోదు కావట్లేదు. మొత్తం 43 వేలకు పైగా పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు అయ్యాయి. రంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు తాజాగా నమోదు అయ్యాయి.

జిల్లాలవారీగా 24 గంటల్లో ఆదిలాబాద్-28, భద్రాద్రి కొత్తగూడెం-39, జగిత్యాల-52, జనగామ-59, జయశంకర్ భూపాలపల్లి-17, జోగుళాంబ గద్వాల-56, కామారెడ్డి-39, కరీంనగర్-89, ఖమ్మం-73, కొమరంభీమ్ ఆసిఫాబాద్-3, మహబూబ్ నగర్-43, మహబూబాబాద్-34, మంచిర్యాల-45, మెదక్-18, మేడ్చల్ మల్కాజ్‌గిరి-71, ములుగు-29, నాగర్ కర్నూలు-53, నల్లగొండ-84, నారాయణపేట్-16, నిర్మల్-24, నిజామాబాద్-53,పెద్దపల్లి-64, రాజన్న సిరిసిల్ల- 54, రంగారెడ్డి-124, సంగారెడ్డి-86, సిద్ధిపేట్-71, సూర్యాపేట్-64, వికారాబాాద్-19, వనపర్తి-38, వరంగల్ రూరల్-26, వరంగల్ అర్బన్-144, యాదగిరి భువనగిరి-18 కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

    School Bus Drivers Facing Problem In Lockdown లాక్ డౌన్ లో స్కూల్ బస్ డ్రైవర్ల ఇబ్బందులు!!

    24 గంటల వ్యవధిలో మొత్తం 23,303 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 6,89,150కు చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్, సీబీనాట్ ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 18,562.2 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+