రేవంత్ రెడ్డి మనవడి ఫస్ట్ ఫొటో
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంట్లోకి కొత్త అతిథి వచ్చాడు. ఆయనకు మనవడు జన్మించాడు. రేవంత్ రెడ్డి కుమార్తె నైమిష రెడ్డి.. వారం రోజుల కిందట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారి ఫొటోను కొద్దిసేపటి కిందటే తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తన ఇంటికి కొత్త అతిథి వచ్చాడని సంతోషాన్ని పంచుకున్నారు.
2015 డిసెంబర్‌లో నైమిష రెడ్డి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహానికి పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కుమార్తె వివాహ సమయంలో రేవంత్ రెడ్డి జైలులో ఉన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన చర్లపల్లి కేంద్ర కారాగారంలో గడిపారు. నైమిష రెడ్డి వివాహానికి హాజరు కావాల్సి ఉన్నందున ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది.

మధ్యంతర బెయిల్‌పై విడుదలైన అనంతరం వివాహ వేడుకలకు హాజరయ్యారు. అంతకుముందు అదే ఏడాది జూన్‌లో జరిగిన నైమిష రెడ్డి నిశ్చితార్థానికి కూడా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సహా పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు.
అప్పట్లో రేవంత్ రెడ్డి- తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడిగా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఘన విజయాన్ని సాధించారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ నుంచి పోటీ చేసి, గెలిచారు.
I am happy to share with you all that we are blessed with the arrival of our grandson. My little girl Nymisha delivered a baby boy last week.
— Revanth Reddy (@revanth_anumula) April 9, 2023
I wish all your blessings for the baby and the mother. pic.twitter.com/DZOm1DHVtj
ఆ కొద్దిరోజులకే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. ఆయన సారథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్- ఈ ఏడాది చివర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఎదుర్కొన్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలే తగిలాయి. అయినప్పటికీ- రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం ఉంచింది.












Click it and Unblock the Notifications