Hyderabad: హైదరాబాద్ వాసులకు ఇక చుక్కలే.. !
ఈసారి చలికాలంలో చలి ఎక్కువగా లేనప్పటికీ.. ఎండలు మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం ఉష్ణోగ్రత పెరుగుతోంది. సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతు నమోదువుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి, ఏప్రిలో, మేలో కూడా ఎండలు మండిపోయే అవకాశం ఉందని వివరించింది.
మంగళవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొండా మార్కెట్. సరూర్ నగర్ సో గరిష్ఠంగా 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. బాలానగర్ లో 35.9 ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నమే కాదు రాత్రి ఉష్ణోగ్రతులు కూడా పెరిగాయి. రాత్రి సమయంలో 20 నుంచి 21 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలను బట్టి చూస్తే ఈసారి ఎండలు మండిపయో అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.

ఫిబ్రవరిలోనే ఎండలు ఇంతగా ఉంటే మార్చి, ఏప్రిల్, మేలో హైదరాబాద్ వాసులకు చుక్కలు చూసే అవకాశం ఉంది. ఈసారి ఎండకాలంలోనే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. దీంతో ఎండల్లో ఎలా తిరగాలని నేతలు భయపడుతున్నారు.
ఇప్పుడే మూలకున్న కూలర్లను తీసి దుమ్ము దులిపి వాడడం మొదలు పెట్టారు. చలి తగ్గడంతో రాత్రి వేళ్లల్లో ఫ్యాన్ల వినియోగం కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఏసీల వాడకం కూడా పెరిగింది. దీంతో కూలర్లు, ఏసీలకు గిరాకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 3,100 మెగావాట్ల డిమాండ్ ఉండగా.. రాత్రి 2,697 మెగవాట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది ఎక్కవే. దీంతో అధికారులు విద్యుత్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications