Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ వర్సెస్ కశ్మీర్ ఫైల్స్ ప్రదర్శన

ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ సీరీస్ ను కేంద్రం నిషేధించడం దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు కారణమవుతోంది. మోడీపై బీబీసీ సిరీస్ ను ప్రదర్శించకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్ధి సంఘాలు ప్రదర్శనలకు దిగుతున్నాయి. తాజాగా ఇదే క్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మరోసారి బీబీసీ సిరీస్ ను ఎస్ఎఫ్ఐ విద్యార్ధులు ప్రదర్శించారు. దీన్ని ముందుగా ప్రచారం చేసి మరీ ప్రదర్శించారు.

హెచ్సీయూలో ఎస్ఎఫ్ఐ విద్యార్ధులు బీబీసీ సీరీస్ ప్రదర్శనతో రెచ్చిపోయిన ఆరెస్సెస్ విద్యార్ధి సంఘం ఏబీవీపీ నేతలు కూడా పోటీగా కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకూ ఉద్రిక్తతలు కొనసాగాయి.

tension in hyderabad central versity with screening bbc documentary versus kashmir files

ఈ మధ్యే జనవరి 21న వర్శిటీలో కొందరు విద్యార్ధులు బీబీసీ సిరీస్ ప్రదర్శించడంతో దీనిపై అధికారులు ఇరుకునపడ్డారు. దీనిపై యూజీసీ నుంచి నోటీసులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి విద్యార్ధులు బీబీసీ సిరీస్ ప్రదర్శించడం వివాదాస్పదం అవుతోంది.

అయితే మోడీపై బీబీసీ సిరీస్ ప్రదర్శనకు నిరసనగా కశ్మీర్ ఫైల్స్ ప్రదర్శన ద్వారా ఏబీవీపీ విద్యార్ధులు సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే దీనికి కూడా ఎస్ఎఫ్ఐ నేతల నుంచి అవాంతరాలు ఎదురయ్యాయి. అయినా ఎట్టకేలకు ఏబీవీపీ కశ్మీర్ ఫైల్స్ ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది. దీనిపైనా యూనివర్శిటీ అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ లోపు విద్యార్ధి సంఘాలు పోటాపోటీగా ప్రదర్శనలకు దిగడంతో వర్శిటీలో ఉద్రిక్త పరిస్దితులు నెలకొంటున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+