బంజారాహిల్స్ భూ కబ్జా కేసు.. టీజీ వెంకటేశ్ పేరు తొలగింపు

హైదరాబాద్ బంజారాహిల్స్ భూ కబ్జా కలకలం రేపింది. ఇందులో ఎంపీ టీజీ వెంకటేశ్ పేరు కూడా వినిపించింది. విచారణ తర్వాత.. అతనికి రిలీఫ్ కలిగింది. భూకబ్జా కేసులో టీజీకి ఊరట కలిగింది. భూకబ్జా కేసు నుంచి ఆయన పేరుని పోలీసులు తొలగించారు. ఇందులో టీజీ వెంకటేశ్ ప్రమేయం లేదని బంజారాహిల్స్ పోలీసులు నిర్ధారించారు. దీంతో కేసు నుంచి ఆయన పేరుని తొలగించారు. గతంలో ఎఫ్ఐఆర్‌లో టీజీ పేరుని ఏ-5గా చేర్చారు. తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపిన పోలీసులు.. టీజీ ప్రమేయం లేదని తేల్చారు. ఆయన పేరుని చార్జ్ షీట్ నుంచి తొలగించారు.

ఇటీవల సంచలనం సృష్టించిన హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 ల్యాండ్ కబ్జా కేసులో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏ1గా ఉన్న విశ్వప్రసాద్‌తోపాటు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. అమెరికాలో ఉన్న విశ్వప్రసాద్‌‌ను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అమెరికా దౌత్య కార్యాలయంలో లేఖ ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు.

bjp mp tg venkatesh name removed banjara hills land grabbing case.

కేసులో ఏ5గా ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ పేరు వినిపించింది. అతనిని అరెస్ట్ చేసే అంశంపై పోలీసులు న్యాయ సలహా కూడా తీసుకున్నారు. కానీ ఇంతలోనే ఆయనకు ఊరట కలిగింది. కేసులో ప్రధాన నిందితుల వాంగ్మూలం ఆధారంగా టీజీ వెంకటేష్ పేరు ఏ5గా చేర్చామని పోలీసులు తెలిపారు. సినిమా షూటింగ్ అని చెప్పి, కబ్జా కోసం యత్నించారని ఆధారాలు సేకరించామని చెప్పారు. పూర్తిస్థాయి విచారణలో మాత్రం అదేం లేదని చెప్పారు. అతని పేరును తొలగించారు. మిగతా వారి పాత్రపై మాత్రం ఎంక్వైరీ కొనసాగుతుందని పోలీసులు స్పష్టంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+