హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ప్ర‌జ‌ల ఆశ‌లు ఆవిర‌య్యాయి..! మేడ్చెల్ స‌భ‌లో ఉద్వేగంగా ప్ర‌సంగించిన సోనియా గాంధీ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : నేను తెలంగాణాకు రావడం బిడ్డ దగ్గరకు తల్లి వచ్చినట్లుగా ఉంది | Oneindia

హైద‌రాబాద్: తెలంగాణ సిద్దించిన త‌ర్వాత తొలిసారి తెలంగాణ గ‌డ్డ‌మీద కాలుమోపిన సోనియా గాంధీ ఉద్వేగ‌భ‌రిత‌మైన భావాల‌ను వ్య‌క్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ క‌ల సాకారం చేసిన ఉద్దేశం ఒక‌టైతే, జ‌రిగింది మ‌రొక‌ట‌ని తెలియ‌జేసారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేడ్చ‌ల్ లో ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆమె పాల్గొని ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారానికి మ‌రింత వేగం పెంచారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమాల‌కు, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు విరుద్దంగా న‌డుచుకుంద‌ని, అందుకోసం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ ఆపార్టీని ఓడించాల‌ని పిలుపునిచ్చారు. అంతే విభ‌జ‌న వ‌ల్ల ఏపీ కి జ‌రిగిన న‌ష్టాన్ని కూడా ఆమె ప్ర‌స్థావించారు. ఆంద్ర ప్ర‌దేశ్ కి ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంద‌ని చెప్పారు సోనియా గాంధీ.

టీఆర్ ఎస్ కుటుంబం కోస‌మే పాలించింది..! మేడ్చెల్ స‌భ‌లో సోనియా ద్వ‌జం.!!

టీఆర్ ఎస్ కుటుంబం కోస‌మే పాలించింది..! మేడ్చెల్ స‌భ‌లో సోనియా ద్వ‌జం.!!

తెలంగాణ ముందస్తు ఎన్నికలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాకతో తెలంగాణ ఎన్నికల సమరం వేడెక్కింది. శుక్రవారం సాయంత్రం మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభ ఆ పార్టీకి మరింత ఊపిరి ఊదింది. దేశంలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గడ్, మిజోరాంలలో శాసనసభల ఎన్నికలు జరుగుతున్నా... ఆయా రాష్ట్రాలకు వెళ్లని సోనియా ప్రత్యేకించి తెలంగాణకు రావడం ఇక్కడి ఎన్నికల ప్రచారానికి మరింత ఊపునిచ్చింది.

మ‌హిళ‌ల‌కు, వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు న్యాయం చేయ‌ని గులాబీ పార్టీ..! ఆవేద‌న వ్య‌క్తం చేసిన సోనియా..!!

మ‌హిళ‌ల‌కు, వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు న్యాయం చేయ‌ని గులాబీ పార్టీ..! ఆవేద‌న వ్య‌క్తం చేసిన సోనియా..!!

అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పాడ్డాయి. ఈ ఏర్పాటు తర్వాత తెలంగాణలో ఎన్నికల సమరం జోరందుకుంది. ఇప్పుడు సోనియా రాకతో తెలంగాణలో శీతాకాలంలో ఎన్నికల వేడిగాలులు వీస్తున్నాయి. సోనియా సభకు భారీ ఎత్తున ప్రజలు రావడం, సోనియా ప్రసంగానికి అడుగడుగునా నీరాజనాలు పలకడం కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరచింది. రాజకీయంగా తమకు ఇబ్బంది కలుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ ఏర్పాటు వైపే మొగ్గు చూపామని సోనియా ప్రకటించడం తెలంగాణ వాసులలో ఓ చర్చకు దారి తీసింది.

ఏపి స‌మ‌స్య‌ల‌ను గుర్తు చేసిన సోనియా..! ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఉద్ఘాట‌న‌..!!

ఏపి స‌మ‌స్య‌ల‌ను గుర్తు చేసిన సోనియా..! ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఉద్ఘాట‌న‌..!!

ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ విభజన చట్టంలో పేర్కొన్నామని, ఆ హామీని నెరవేర్చి తీరుతామని సోనియా ప్రకటించారు. ఇది హైదరబాదులో ఉన్న ఆంధ్ర సెటిలర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాను తెలంగాణాకు రావడం బిడ్డ దగ్గరకు తల్లి వచ్చినట్లుగా ఉందని సోనియా గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజలను ప్రభావితం చేస్తుందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
తాము తెలంగాణ ఇచ్చామని చెప్పడం కంటే మీ పోరాటాల కారణంగానే తెలంగాణ వచ్చిందని సోనియా గాంధీ ప్రకటించారు.

సోనియా, రాహుల్ రాక‌తో మ‌రింత ఊపందుకున్న ప్ర‌చారం..! వేడి పెంచిన కాంగ్రెస్ పార్టీ..!

సోనియా, రాహుల్ రాక‌తో మ‌రింత ఊపందుకున్న ప్ర‌చారం..! వేడి పెంచిన కాంగ్రెస్ పార్టీ..!

ఈ ప్రకటన కూడా తెలంగాణ వాసులలో ఆలోచనలు రేకెత్తిస్తుందని మహాకూటమికి ఓటు వేసే దిశగా దీని ప్రభావం ఉంటుందని లెక్కలు తీస్తున్నారు. ఇక మేడ్చల్ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ శ్రేణులలో రెట్టించిన ఉత్సాహం కనబడుతోంది. టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దేవుడైందని, ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ దేవతగా టిఆర్‌ఎస్ నాయకులకు కనిపించింద‌ని, ఇప్పుడు మాత్రం అదే పార్టీ అదే మనిషి దెయ్యంలా కనిపిస్తోందనడం వారి దిగజారుడుతనమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ ముందస్తు ఎన్నికలలో మహాకూటమి తన అభ్యర్దులను గెలిపించే దిశగా తమ ప్రచారాన్ని మరింత పెంచింది. సోనియా, రాహుల్ తెలంగాణ ప్ర‌చారంలో పాల్గొన‌డంతో ఎన్నిక‌ల వేడి మ‌రింత ఊపందుకుంది.

English summary
Telangana Pre-election polls With the arrival of former Congress president Sonia Gandhi, the Telangana electorate has been warming up. The party's public meeting was held in Medchel on Friday evening which brought josh in telangana congress party..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X