సాహస యాత్రలపై ఆసక్తి చూపుతున్న మహిళాలోకం .. వెల్లడించిన తాజా అధ్యయనం
మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. ఒక్క ఉద్యోగ వ్యాపారాలలో నే కాకుండా సాహస యాత్రలో కూడా మహిళలు మేము సైతం అంటున్నారు. సాహస యాత్రలపై మహిళలకు ప్రతియేటా ఆసక్తి పెరుగుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
భారతదేశంలో సాహస యాత్రలు చేస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఒక్క భారతదేశంలోనే కాకుండా విదేశాలలో సైతం సాహస యాత్రలు చేసేందుకు మహిళలు అమితాసక్తి చూపుతున్నారు అని ప్రముఖ ట్రావెల్ కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్ అధ్యయనం వెల్లడించింది.

విభిన్న రకాల సాహస కార్యకలాపాలను ఎంచుకుంటున్న మహిళల సంఖ్య ఏడాది కాలంలోనే 32శాతం పెరిగిందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. దేశంలోనే రెండు వేల మంది మహిళల ప్రయాణాల బుకింగ్, విచారణ ధోరణుల ఆధారంగా చేసిన అధ్యయనంలో ఈ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మిలీనియల్స్ లేదా జెన్ వై మహిళలు ప్రయాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వీరిలో 70% మంది మెట్రో నగరాల నుంచి మిగతావారు ద్వితీయ శ్రేణి నగరాల నుంచి ఉన్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. లాయర్లు, డాక్టర్లు, కార్పొరేట్ మేనేజర్లు, రైటర్లు, డిజైనర్లు, వివిధ సంస్థల నిర్వాహకులు వీరిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు ఇలా సాహస యాత్రలు చేస్తున్న మహిళలు ఒక పక్కా ప్లాన్ ప్రకారం తాము వెళ్లే ప్రదేశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం తోపాటుగా, తమ భద్రతకు పెద్దపీట వేస్తూ సాహస కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా డైవింగ్ , ట్రెక్కింగ్ వంటి సాహస కృత్యాలు అంటే మగువలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు అని అధ్యయనాలు చెప్తున్నాయి.












Click it and Unblock the Notifications