Cyber Crime: సైబర్ క్రైమ్.. బాధితుడికి రూ.27 లక్షలు తిరిగి వచ్చేలా చేసిన పోలీసులు..

రాష్ట్రంలో సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లోనే కాదు జిల్లాల్లో కూడా సైబర్ క్రైమ్ మోసాలు పెరుగుతోన్నాయి. చాలా మంది లక్షల్లో డబ్బులను పోగొట్టుకుంటున్నారు. సైబర్ క్రైమ్ చేతిలో మోసపోయిన బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేయడం కొంత ఫలితం పొందవచ్చు. తాజాగా స్టాక్ మార్కెట్ నిపుణులుగా నటిస్తూ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఓ ఆన్‌లైన్ మోసానికి గురైన బాధితుడికి సైబరాబాద్ పోలీసులు రూ.27 లక్షల మొత్తాన్ని తిరిగి వచ్చేలా చేశారు.

బాధితుడు చేసిన ఫిర్యాదును అనుసరించి పోలీసులు మొదట బ్యాంకులను సంప్రదించి ఖాతాను బ్లాక్ చేయించారు. దీంతో సైబర్ నేరగాళ్లు సదరు డబ్బును ఖాతాలోకి జమ చేసుకోలేకపోయారు. డబ్బు కోర్టు ఆర్డర్ పొందిన తర్వాత బాధితుడికి తిరిగి చెల్లిస్తారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని సైబర్ మోసగాళ్లు సంప్రదించారు. స్టాక్ మార్కెట్ లో గణనీయమైన లాభాలను వస్తాయని ఆశ చూపారు. స్టాక్ మార్కెట్ నేర్చుకోవడంలో సహాయం అందించారు.

The police have returned Rs 27 lakh to the victim who was duped by cyber criminals

వారు అందించిన అనేక బ్యాంకు ఖాతాలకు బాధితుడు పెట్టుబడిగా రూ. 1,31,57,363ను బదిలీ చేశారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు ముఖం చాటేశారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు బ్యాంక్ సంప్రదించారు. రూ.27 లక్షల సొమ్మును బాధితుడికి తిరిగి వచ్చేలా చేశారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీసులు పౌరులకు సూచించారు.

ఇలాంటి మోసాల ద్వారా పోగొట్టుకున్న డబ్బు తక్షణమే ప్రతిస్పందనగా ఉంటే డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులను నివేదించవచ్చని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+