• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

త్వరలో తెరుచుకోనున్న థియేటర్లు... తెలంగాణా సర్కార్ కసరత్తు .. రీజన్ ఇదే

|

కరోనావైరస్ కేసులు పెరుగుతున్న వేళ విధించిన లాక్ డౌన్ తో సినీ అనుబంధ రంగాలు కూడా మూత పడ్డాయి. కరోనా తగ్గని క్రమంలో మరో రెండు, మూడు నెలల వరకు థియేటర్లు తెరిచేందుకు వాతావరణం సానుకూలంగా లేదనే భావన వ్యక్తం అవుతుంది . కానీ అదే జరిగితే థియేటర్ల యాజమాన్యాలు దివాలా తీసే పరిస్థితి వస్తుంది. ఇక ఈ నేపధ్యంలో థియేటర్లు తెరవటానికి అనుమతి ఇవ్వాలని టాలీవుడ్ ప్రముఖులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కోరారు . ఇక ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్న తెలంగాణా సర్కార్ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం .

థియేటర్లు , మల్టీ ప్లెక్స్ లను నిండా ముంచేసిన కరోనా లాక్ డౌన్..మూడు నెలల వరకు నో పర్మిషన్?

థియేటర్లను తెరవటానికి తెలంగాణా ప్రభుత్వం కసరత్తు

థియేటర్లను తెరవటానికి తెలంగాణా ప్రభుత్వం కసరత్తు

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్లను తెరవటానికి తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక థియేటర్ల యాజమాన్యాలు నిర్దిష్టమైన మార్గదర్శకాలను పాటించేందుకు సిద్ధపడడంతో తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో థియేటర్లతో కరోనా వ్యాప్తికి చాలా తక్కువ అవకాశం ఉంటుందని వైద్యులు సైతం చెప్పటంతో తెలంగాణా ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేస్తుంది .

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రితో భేటీ అయిన సినీ ప్రముఖులు

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రితో భేటీ అయిన సినీ ప్రముఖులు

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో నిర్మాతలు కళ్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ శంకర్, మా అద్యక్షుడు నరేష్, జీవిత, పలువురు నిర్మాతలు తడుతరులు సమావేశం అయ్యారు. లాక్ డౌన్‌తో వారు అనుభవిస్తున్న సినిమాకష్టాల గురించి టాలీవుడ్ ప్రముఖులు మంత్రికి వివరించారు. థియేటర్లు తెరవకపోతే థియేటర్ల యాజమాన్యాలే కాదు చిత్ర పరిశ్రమ ఎంతగా నష్టపోతుందో చెప్పారు .

రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీతో భేటీ

రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీతో భేటీ

దీంతో మంత్రి రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీతో సమావేశమై థియేటర్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనే ప్రధానంగా చర్చిస్తామని మంత్రి సినీ ప్రముఖులకు తెలిపారు. అయితే, థియేటర్లను తెరిస్తే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం వుందంటూ వ్యక్తమవుతున్న అనుమానాలపై ప్రభుత్వం వైద్య వర్గాల అభిప్రాయాలను, వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందని తెలుస్తోంది.ఇక ఈ నిర్ణయాల నేపధ్యంలో థియేటర్లు తెరవటానికి సమాలోచనలు చేస్తున్నట్టు అర్ధమవుతుంది.

 థియేటర్లతో కరోనా వ్యాప్తికి తక్కువ ఛాన్స్.. అందుకే థియేటర్లు తెరిచే ఆలోచన

థియేటర్లతో కరోనా వ్యాప్తికి తక్కువ ఛాన్స్.. అందుకే థియేటర్లు తెరిచే ఆలోచన

ఇక కరోనా వైరస్ షాపింగ్ మాల్స్, మత సంబంధమైన సదస్సులు, రాజకీయ మీటింగ్ ల వాటి కంటే థియేటర్లను తెరవడం వల్ల పెద్దగా వ్యాప్తి చెందే అవకాశం లేదని ఒక అభిప్రాయం . మౌఖిక సంభాషణలకు పెద్దగా అవకాశం వున్న వివిధ కార్యక్రమాలతో వైరస్ వ్యాప్తికి 20 నుంచి 22 శాతం అవకాశం వుండగా, థియేటర్లలో కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా విస్తరించే అవకాశాలు కేవలం 2 శాతమేనని తెలుస్తోంది. ఇక ఈ నేపధ్యంలోనే నిర్దిష్టమైన షరతులు, ముందు జాగ్రత్త చర్యలతో థియేటర్లను తెరిచే ఆలోచన చేస్తుంది తెలంగాణా సర్కార్ .

English summary
Tollywood celebrities have asked cinematography minister Talasani Srinivas Yadav to grant permission to open theaters those hit by the corona lockdown. Telangana government is studying the feasibility of the matter, is likely to give a green signal soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more