హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసలు చర్చలే జరగలేదు... ఆర్టీసీ జేఏసీ

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మికులు మరియు అధికారుల మధ్య చర్చలే జరగలేదు. అధికారుల మమ్మల్ని నిర్భంధంలో పెట్టి చర్చలు జరపాలని చూశారని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు. కోర్టు ఆదేశాలతో కేవలం 21 డిమాండ్లపై చర్చలు చేపట్టాలని అధికారులు చెప్పారు. చర్చల్లో భాగంగా ఫోన్లు గుంజుకుని నిర్భంధంలో పెట్టారని అన్నారు. అయితే అధికారులు ఇచ్చిన ఎజెండాపై చర్చించేందుకు తాము ఇతర నాయకులతో చర్చించి మళ్లి వస్తామని తెలిపినట్టు వారు తెలిపారు. దీంతో అధికారులు ఎప్పుడు పిలిచినా వస్తామని చెప్పామని తెలిపారు.

ఆర్టీసీ చర్చల్లో ఎలాంటీ పురోగతి కనిపించలేదు. ఆర్టీసీ కార్మికులు 26 డిమాండ్లతో లోపలికి వెళ్లగా అధికారులు కోర్టు సూచించిన 21 డిమాండ్లపై చర్చించాలని అధికారులు ఒత్తిడి తెచ్చారని చెప్పారు. మరోవైపు కోర్టు ఉత్తర్వులు అమలు చేయమనందుకే తూతూ మంత్రాలు జరిపే విధంగా చర్చలు జరిపారని వారు చెప్పారు. దీంతో కోర్టు చెప్పినట్టుగా ఆర్టీసీ నాయకులే వెళ్లిపోయారనే అపవాదును మా మీద వేసేందుకు చర్చలు జరిగిన తీరు ఉందని చెప్పారు.

There were no actual discussions : RTC JAC

కాగా చర్చలకు సంబంధించి పూర్తిగా వీడియో రికార్డు చేశారు. అయితే కార్మికులు చెబుతున్నట్టుగా అధికారులే చర్చలను ముగించి వేళ్లారని చెప్పారు.ఇది దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. ఎప్పుడైన చర్చల్లో ప్రధానంగా కార్మికులు బహిష్కరించి వస్తారని కాని ప్రస్తుతం జరిగిన చర్చల్లో అధికారులే బహిష్కరించి వెళ్లడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుందని చెప్పారు. దీంతో ఈ రికార్డును కోర్టు విన్న తర్వాత ఎలాంటీ చర్యలు చేపడుతుందో తెలియని పరిస్థితి ఉంది.

English summary
There were no discussions between RTC unions and govt officials. RTC JAC leaders said that the authorities were looking for us to be detained and negotiated
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X