IPL 2024: ఆన్ లైన్ లో ఐపీఎల్ టికెట్లు కొంటున్నారా.. అయితే జాగ్రత్త..

దేశంలో ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు ఉన్నప్పటికీ.. ఐపీఎల్ మేనియా మాత్రం కొనసాగుతోంది. ఐపీఎల్ కు భారత్ లో భారీగా క్రేజ్ ఉంది. చాలా మంది అభిమానులు ఒక్క మ్యాచ్ అన్నా.. స్టేడియానికి వెళ్లి చూడాలనుకుంటారు. పోటీ పడి మరి టికెట్లు కొంటారు. కొందరు డబ్బులు పోయినా బ్లాక్ లో టికెట్లు కొనుగోలు చేస్తారు. అయితే ఐపీఎల్ టికెట్ల కొనుగోలు విషయంలో పోలీసులు క్రికెట్ అభిమానులను హెచ్చరించారు.

సైబర్ ముఠాలు ఐపీఎల్ టికెట్లు విక్రయిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న జరగనున్న మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి, క్యూఆర్‌ కోడ్‌లు పంపి కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు.

They are committing cyber crimes by selling IPL tickets in hyderabad

ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. హైదరాబాద్, చెన్నై మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. పేటీఎం ఆన్‌లైన్‌లో అమ్మకాలను నిలిపివేసింది కూడా. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముతున్నామంటూ మోసాలకు తెగబడుతున్నారు. క్యూఆర్ కోడ్స్ వాట్సాప్ చేస్తూ పైసలు దండుకుంటున్నారు. రాయితీలు ఇస్తామంటూ ఆకర్షిస్తున్నారు.

కాగా ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు మ్యాచ్ లో ఆడింది. ఇందులో ఒక మ్యాచ్ లో గెలవగా.. మరో మ్యాచ్ లో ఓటమిపాలయింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు స్కోర్ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+