Crime: నాగోల్ కాల్పుల ఘటనలో దర్యాప్తు ముమ్మరం.. దుండగుల కోసం కొనసాగుతున్న వేట..
హైదరాబాద్ నాగోల్ లోని నగల దుకాణంలో కాల్పుల ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. 15 టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. గురువారం రాత్రే ఘటన స్థలికి చేరుకున్న క్లూస్ టీమ్ పలు ఆధారాలను స్వీకరించింది.

షట్టర్ క్లోజ్
గురువారం రాత్రి నాగోల్ లోని స్నేహపూరి కాలనీలోని ఓ నగల దుకాణంలో గురువారం రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చారు. కస్టమర్ల లాగా దుకాణంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత దుకాణం షట్టర్ క్లోజ్ చేసి బంగారం ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. దుకాణ యజమాని అడుకునే ప్రయత్నం చేయగా నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరి గాయపడ్డారు. నిందితులు బంగారంతో పాటు, డబ్బును తీసుకుని పారిపోయారు.

నెంబర్ ప్లేట్
నిందితులు హెల్మెంట్ ధరించి ఉన్నారు. వారు వచ్చిన బైక్ కు నెంబర్ ప్లేట్ కూడా లేనట్లు సీసీ కెమెరా ఫుటేజిలో కనిపించింది. దుండగులు పథకం ప్రకారమే దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. గోల్డ్ షాప్‌లో దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది.

బంగారం డెలివరీ
బంగారం డెలివరీ చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని.. ఈ ముగ్గురు దుండగులు ఫాలో అయినట్లు సీసీ కెమెరా ఫుడేజీ ఆధారంగా తెలుస్తుంది. ఆభరణాలని కళ్యాణ్ సింగ్‌కి ఇస్తున్న సమయంలో దుండగులు షాప్‌లోకి చొరబడి, బంగారం, డబ్బు తీసుకొని పారిపోయారు. దుండగులో కాల్పుల్లో దుకాణ యజమాని కళ్యాణ్‌తో పాటు మరొకరు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారి ఎలాంటి ప్రాణ హాని లేదని వైద్యులు తెలిపారు. ఒక పల్సర్ బైకు, మరో యాక్టివా బైక్‌పై దుండగులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications