హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ లో చేరేవారికి టికెట్లహామీ ఇవ్వట్లేదు; పార్టీలో అంతర్గత విబేధాలపైనా.. రేవంత్ రెడ్డి సంచలనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరికల నేపథ్యంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి టిక్కెట్ల హామీ, పార్టీలో ఉన్న అంతర్గత కలహాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు సాధారణ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ విధానానికి అనుగుణంగానే టికెట్ల కేటాయింపు జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

పార్టీలో చేరికలపై వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాం

పార్టీలో చేరికలపై వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాం

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్ తో ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మాణిక్కం ఠాగూర్ లు భేటీ అయి రాష్ట్రంలోని పరిస్థితులు, పార్టీలో చేరికలు, రాహుల్ గాంధీ పర్యటన పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను చర్చించారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో ముందు ముందు పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి, చేరికల విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. అధికార పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్న నేతలను టీఆర్‌ఎస్ పార్టీ వేధింపులకు గురిచేస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఆ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

జిల్లాలలో రాజకీయ పరిస్థితులను బట్టి చేరికలు

జిల్లాలలో రాజకీయ పరిస్థితులను బట్టి చేరికలు

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించినట్లు తెలిపారు. 2022 జులై 7న టీపీసీసీ చీఫ్‌గా ఏడాది పూర్తవుతున్నట్లు పేర్కొంటూ, తన నాయకత్వంలో పార్టీ రాష్ట్ర శాఖ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించానని చెప్పారు. రానున్న రోజుల్లో పలువురు ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరతారని, వివిధ జిల్లాల్లోని రాజకీయ పరిస్థితులను బట్టి ఇతర పార్టీల నేతలను స్వాగతిస్తామని చెప్పారు.

పీకే వ్యూహాలు ఎదుర్కొనేందుకు తమ రాజకీయ వ్యూహాలు

పీకే వ్యూహాలు ఎదుర్కొనేందుకు తమ రాజకీయ వ్యూహాలు


రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఆయన మిత్రుడు కేసీఆర్, బీజేపీ, స్క్రిప్ట్ ప్రకారమే డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమలు చేసిన అదే ప్రణాళికను అమలు చేయడానికి పీకే ప్రయత్నిస్తున్నారని, పీకే వ్యూహాలను దీటుగా ఎదుర్కొనేందుకు తమ రాజకీయ వ్యూహాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

పార్టీలో ఉంది భిన్నభిప్రాయాలే.. బేధాభిప్రాయాలు కాదు .. పరిష్కరించుకుంటాం

పార్టీలో ఉంది భిన్నభిప్రాయాలే.. బేధాభిప్రాయాలు కాదు .. పరిష్కరించుకుంటాం


ఇక ఇదే సమయంలో పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు కానీ భేదాభిప్రాయాలు కాదని స్పష్టం చేశారు. పార్టీలో ఉన్న సమస్యలను అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ సభ నిర్వహించిందని, ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించబోతోంది అని, ఇక మూడో సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నదని పేర్కొన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సభ ద్వారా ఎవరి బలం ఏంటో అర్థం అవుతుందని స్పష్టం చేశారు.

English summary
Revanth Reddy made interesting comments that tickets are not guaranteed to those who join the Congress and that there are differences of opinion in the party, we will sorted it within the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X