మరో 5 కేసులు.. 84కి చేరిన వైనం... అందుబాటులో మందులు

ఒమిక్రాన్ కేసు అంటేనే దడ.. సీరియస్ నెస్ లేదని సైంటిస్టులు చెబుతున్న ఎక్కడో తెలియని భయం. ఇటు తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి. రోజుకు కనీసం 5 నుంచి 10 వరకు కేసులు వస్తున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు ఒమిక్రాన్ బారిన పడ్డారు. వీరందరినీ టిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. దీంతో కేసుల మొత్తం సంఖ్య 84కి చేరింది. పాజిటివ్ వచ్చిన వారి.. కాంటాక్టులు ట్రేస్ చేసీ.. టెస్టులకు పుణెకు పంపిస్తున్నారు. పాజిటివ్ వస్తే వారిని కూడా టిమ్స్ తరలిస్తున్నారు.

కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందుకు తగిన జాగ్రత్తలను తీసుకుంటుంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టంచేసింది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఒమిక్రాన్ వైరస్ వాయువేగంతో వ్యాపిస్తోంది. ఒకరికి సోకితే.. ఆ ఫ్యామిలీకి దాదాపుగా వస్తోంది. సన్నిహితంగా మెలిగితే చాలు వైరస్ వస్తోంది.

today 5 people confirmed omicron virus at telangana state

ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఆ అంక్షలను జనవరి 10వ తేదీ వరకు పెంచింది. గుంపులు గుంపులు ఉండొద్దని స్పష్టంచేసింది. పని మీద బయటకు వచ్చినా.. విధిగా మాస్క్ ధరించాలని స్పష్టంచేసింది. మాస్క్ లేకుంటే రూ.వెయ్యి జరిమానా తప్పదని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని నిన్న సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులకు తేల్చిచెప్పారు. దాంతో పోలీసులు కూడా ఆ పనిలో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి నిషేధించిన సంగతి తెలిసిందే.

ఒమిక్రాన్ టెన్షన్‌తో నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+