హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టాలీవుడ్ డ్రగ్స్ కేసు : నేడు ఈడీ విచారణకు ఛార్మి .. కెల్విన్ లొంగుబాటుతో సినీవర్గాల్లో టెన్షన్ !!

|
Google Oneindia TeluguNews

తెలుగురాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణను ప్రారంభించిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద ఈ కేసులో ఈడీ సినీ రంగానికి చెందిన 12 మంది ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇక ఈ రోజు చార్మి ఈడీ విచారణకు హాజరు కానున్నారు.

#YSR :మరపురాని మహానేత YSR గారి 12వ వర్థంతి సందర్భంగా ఘననివాళులు, ప్రముఖులతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి (ఫొటోస్)

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ ముందుకు 12 మంది సినీ ప్రముఖులు

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ ముందుకు 12 మంది సినీ ప్రముఖులు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ రంగానికి చెందిన ప్రముఖులకు నోటీసులిచ్చిన ఈడి నిన్న పూరీ జగన్నాథ్ విచారించింది. సెప్టెంబర్ 2వ తేదీన ఛార్మిని, సెప్టెంబర్ 3వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్ ను , సెప్టెంబరు 8 వ తేదీన రానా దగ్గుబాటి ని, 9వ తేదీన రవితేజను, శ్రీనివాస్ ను, 13వ తేదీన నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ ను , 15వ తేదీన ముమైత్ ఖాన్ ను, 17న తనీష్, 20వ తేదీన నందు, 22వ తేదీన తరుణ్ లను ఈడీ అధికారులు విచారించనున్నారు. 2017 లో నమోదైన కేసులు ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈడీ విచారణ ఎక్సైజ్ సిట్ విచారణ కు భిన్నంగా కొనసాగుతున్నట్లు సమాచారం.

పూరీ జగన్నాథ్ ను 10 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు

పూరీ జగన్నాథ్ ను 10 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు

ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. దాదాపు 10 గంటల పాటు ఈడీ అధికారులు పూరి జగన్నాథ్ ను విచారించారు. పూరి జగన్నాథ్ కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లపై కూడా ఈడీ అధికారులు ఆరా తీశారు. 2017 సంవత్సరం తో పాటు అంతే అంతకు ముందు ఏడాది ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. ఎవరెవరి ఖాతాలకు పూరి జగన్నాథ్ ఖాతాల నుండి డబ్బులు చెల్లించారన్న వివరాలను ఈడీ అధికారులు సేకరించారు.

నేడు ఈడీ ముందు విచారణకు ఛార్మీ

నేడు ఈడీ ముందు విచారణకు ఛార్మీ

ఇక పూరీ జగన్నాథ్ తన చార్టెడ్ అకౌంటెంట్ సహాయంతో ఈడీ అధికారులు అడిగిన వివరాలకు సమాధానమిచ్చారు. ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడే సమయంలో పూరీ జగన్నాథ్ బండ్ల గణేష్ పేరును ప్రస్తావించినట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఈడీ అధికారులు బండ్ల గణేష్ ని సైతం కార్యాలయానికి రప్పించి ఆయనను కూడా ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈరోజు సినీనటి, నిర్మాత ఛార్మి ఈరోజు ఈడీ విచారణకు హాజరు కానున్నారు .డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో చార్మికి ఈడీ నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు ఆమెను నేడు విచారించనున్నారు.

మనీ లాండరింగ్ కోణంలో ఛార్మిని విచారించనున్న ఈడీ అధికారులు

మనీ లాండరింగ్ కోణంలో ఛార్మిని విచారించనున్న ఈడీ అధికారులు

మనీలాండరింగ్ కోణంలో చార్మి బ్యాంక్ అకౌంట్స్ ను కూడా ఈడీ అధికారులు పరిశీలించనున్నారు .చార్మి ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. డ్రగ్స్ పెడలర్ కెల్విన్ అకౌంట్లోకి చార్మి భారీగా నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరవుతున్న ఛార్మి వ్యవహారం సినీ వర్గాలను ఉత్కంఠగా మారింది. ఛార్మికి కెల్విన్ తో పరిచయం ఎవరి ద్వారా అయ్యింది? ఎంతకాలంగా కెల్విన్ కు ఛార్మి కి పరిచయం ఉంది? ఆమె డ్రగ్స్ తీసుకున్నారా ? కెల్విన్ తో పాటు డ్రగ్స్ సరఫరాకి కూడా ఛార్మి సహకరించారా? కెల్విన్ అకౌంట్ కు ఛార్మి ఎన్ని డబ్బులు పంపించింది? ఎన్నిసార్లు డబ్బు పంపించింది? ఛార్మి, పూరీజగన్నాథ్ ల వ్యాపార భాగస్వామ్యానికి, డ్రగ్స్ కుంభకోణానికి ఏదైనా లింక్ ఉందా? అన్న కోణంలోనూ ఈడీ విచారణ జరుగుతుందని సమాచారం.

అప్రూవర్ గా మారిన కెల్విన్ ... సినీవర్గాల్లో టెన్షన్

అప్రూవర్ గా మారిన కెల్విన్ ... సినీవర్గాల్లో టెన్షన్

ఇక ఈడీ ముందు నిందితుడు కెల్విన్ అప్రూవర్ గా మారడంతో, ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఆరు నెలల క్రితం ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ అధికారులకు విచారణ సమయంలో ఏమాత్రం సహకరించని కెల్విన్, ఇప్పుడు ఈడీ అధికారులకు అప్రూవర్ గా మారడంతో సినీ ప్రముఖుల్లో ఆందోళన మొదలైంది. కెల్విన్ ఎప్పుడు ఎవరి పేరు చెప్తారో అన్న భయంలో సినీ వర్గాలలో ప్రధానంగా కనిపిస్తుంది. ఇక కెల్విన్ ఇస్తున్న సమాచారం ఆధారంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు గుట్టు రట్టు చేసే పనిలో పడ్డారు ఈడీ అధికారులు .

గతంలో సిట్ విచారణ ...డ్రగ్స్ వ్యవహారంలో 12 కేసులు

గతంలో సిట్ విచారణ ...డ్రగ్స్ వ్యవహారంలో 12 కేసులు

గతంలో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో 12 కేసులు నమోదు చేసిన సిట్.. డ్రగ్స్ సరఫరాదారులు, రవాణా చేసిన వారిని మాత్రమే కేసుల్లో చేర్చింది. ఈ కేసులో చాలా మంది ప్రముఖులు ఉన్నట్టు ప్రచారం జరిగింది. 12 మంది అగ్రతారలు కూడా అప్పటి విచారణకు హాజరయ్యారు. రవితేజ, చార్మి, పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ ఇలా చాలా మంది ప్రముఖులు సిట్ ఎదుట హాజరయ్యి తమ వాదన వినిపించారు.
అప్పట్లో ఈ కేసు విచారణకు వాళ్ల నుంచి గోళ్లు, రక్తం, వెంట్రుకలు కూడా సేకరించారు అధికారులు.

ఈడీ దర్యాప్తుతో టాలీవుడ్ లో ప్రకంపనలు

ఈడీ దర్యాప్తుతో టాలీవుడ్ లో ప్రకంపనలు


డ్రగ్స్ కేసులో సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో రెండేళ్ల తర్వాత చార్జిషీట్లు దాఖలు చేసింది సిట్. ఈ కేసులో విచారణకు హాజరయిన సినీ, ఇతర ప్రముఖుల పేర్లు చార్జిషీటులో లేవు. అంతేకాదు 62మంది బాధితులే అని పేర్కొనటంతో పలు అనుమానాల నేపధ్యంలో ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు రేవంత్ రెడ్డి. దీంతో తాము విచారణకు సిద్ధంగా ఉన్నామన్న ఈడీ ఈ కేసు దర్యాప్తుకు రంగంలోకి దిగింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు మొదలయ్యాయి.

English summary
Actress and producer Charmi is scheduled to appear in front of ED today in connection with the Tollywood drugs case. Officials will also look into Charmi's bank accounts in terms of money laundering .ED will also investigate financial transactions of The Charmi Production House. It is alleged that the drugs peddlar kelvin provided the information about the tollywood personalities. It is in this context that the Charmi affair, which is appearing before the entire pre-trial today, has become curious for the tollywood industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X