టాలీవుడ్ డ్రగ్స్ కేసు: రవితేజను ఆరుగంటలపాటు ప్రశ్నించిన ఈడీ, బ్యాంక్ లావాదేవీలపైనే..
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిధుల మళ్లింపునకు సంబంధించి కేసులో గురువారం ప్రముఖ సినీ నటుడు రవితేజ, ఆయన వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించింది. దాదాపు ఆరుగంటల పాటు వీరిద్దరిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.
మనీలాండరింగ్ కోణంలో రవితేజ బ్యాంక్ ఖాతాల అధికారులు పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీసినట్లు సమాచారం. డ్రగ్స్ విక్రేత కెల్విన్ తో ఏమైనా పరిచయం ఉందా? ఆయన ఖాతాకు ఎప్పుడైనా భారీ మొత్తంలో నిధులు పంపించారా? అనే విషయాలతోపాటు ఎఫ్ క్లబ్ గురించిన ప్రశ్నలు వేసినట్లు సమాచారం.

కాగా, ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహమ్మద్ జిషాన్ అలీఖాన్ అలియాస్ జాక్‌ను కూడా ఈడీ అధికారులు విచారించారు. జిషాన్ 2017లో కొకైన్ సరఫరా చేస్తూ ఎక్సైజ్ శాఖకు దొరికాడు. జిషాన్‌తో పాటు బెర్నాడ్ అలియాస్ విలియమ్స్‌ను ఎక్సైజ్ శాఖ అరెస్ట్ చేసింది. ఎఫ్ ప్రొడక్షన్‌కు జిషాన్ గతంలో భాగస్వామిగా వ్యవహరించాడు. సోషల్ మీడియా, యాప్‌ల ద్వారా సినీ తారలకు జిషాన్, విలియమ్స్ డ్రగ్స్ సరఫరా చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. కెంట్ అనే వ్యక్తి ద్వారా నైజీరియా నుంచి కొరియర్స్ ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు నిందితులు ఎక్సైజ్ శాఖకు తెలిపారు.
గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు హీరో రవితేజ. ఇక, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ ఉదయం 9 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 6 గంటల పాటు విచారణ సాగింది. అయితే, ఈ విచారణ సమయంలో గతంలో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసిన కెల్విన్ స్నేహితుడు జిషాన్‌ను ఈడీ కార్యాలయానికి రప్పించారు. ఈడీ విచారణలో రవితేజకు సంబంధించిన ఐదేళ్ల బ్యాంకు లావాదేవీలను పరిశీలించినట్టుగా తెలుస్తోంది. బ్యాంకు లావాదేవీల చుట్టే.. విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్లు చార్మీ, రకుల్ ప్రీత్‌సింగ్, నటులు నందు, రానాలను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అయితే నందు, రానాలను డ్రగ్ అప్రూవర్ కెల్విన్ సమక్షంలో ఈడీ విచారించింది.
Recommended Video
ఇది ఇలావుండగా, డ్రగ్స్ వ్యవహారాలు నగరంలో బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా, నిషేధిత హాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎస్ఆర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఆర్ నగర్ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడిలో చిక్కిన ఇద్దరు నిందితుల నుంచి 25 బాక్స్‌ల హాష్ ఆయిల్‌ను, రెండు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. లక్ష రూపాయల విలువ చేసే నార్కోటిక్ పరికరాలు పట్టుబడడంతో దర్యాప్తును మరింత లోతుగా చేస్తున్నారు పోలీసులు. యువతను టార్గెట్ చేసి మత్తు పదార్థాలకు బానిసలయ్యేలా చేసి వారికి డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, బోరబండకు చెందిన మహబూబ్ అలీ ఈ కేసులో ప్రధాన నిందితుడు. మహబూబ్ అలీపై రెండు దోపిడీ కేసులు, హత్యాయత్నం కేసు ఉన్నాయి. కూలీగా పనిచేసే ఇబ్రహీంఖాన్, విద్యార్థి ఖాజా ముబీనుద్దీన్ ఇద్దరు గంజాయి, హాష్ ఆయిల్, డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. విక్రయాలు కూడా చేస్తున్నారు. దీంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మహబూబ్ అలీ గాలింపు చేపట్టారు.
-
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
రీసెంట్ టైమ్ లో బెస్ట్ టీజర్.. నవ్వి నవ్వి పొట్ట చెక్కలే..!! -
పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ -
రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్‌చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
కొత్త బిజినెస్ షురూ చేసిన తెలుగు యాంకర్..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..!












Click it and Unblock the Notifications