Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ.. చర్చించే అంశాలు ఇవే..

ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల మంటలు నెలకొన్నాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం ద్వంద్వ వైఖరి గురించి చర్చించనున్నారు. ప్రజలను బీజేపీ గందరగోళంలోకి నెడుతోందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ అధినాయకత్వం.. ఈ అంశాన్ని చర్చించనుంది.

సమావేశానికి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీలో ధర్నా చేపట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. ఆ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ధాన్యం అంశంలో కేంద్రాన్ని, బీజేపీని ఎదుర్కొనేందుకు భవిష్యత్ కార్యాచరణను రేపటి సమావేశంలో ఖరారు చేయనున్నారు.

tomorrow held trslp meeting. they discuss about paddy and other key issues

పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు, కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరిపై చర్చించనున్నారు. అదే విధంగా రైతులను, ప్రజలను బీజేపీ అయోమయానికి గురి చేస్తున్న తీరుతెన్నులపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు.

యాసంగిలో వరి వేయడంపై కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశంపై టీఆర్ఎస్ పార్టీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది.యాసంగిలో వరి వేయడంపై కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశంపై టీఆర్ఎస్ పార్టీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది. దీంతోపాటు దళిత బంధు పథకం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. హుజురాబాద్ బై పోల్ తర్వాత.. ప్రభుత్వం చడీ చప్పడు లేదని టాక్ నడుస్తోంది. దీంతో స్పందించే అవకాశం ఉంది.

ఇటు దళిత బంధులో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. పథకం అమలు చేసి పర్యవేక్షించడం, రెండోది పథకం ఫలితాలను అంచనా కట్టడం, మూడోది లబ్ధిదారులు మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం అనే అంశాలను అవలంభించాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా అందించే పది లక్షల నగదుతోపాటు, లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందుతుంది. దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్తితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలుస్తొవది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం అని సీఎం అన్నారు. తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడానికి, దళితుల అభివృద్ధి కోసం మనసుపెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమని సీఎం స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+