నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..! మధ్యాహ్నం నుండే దారి మళ్లింపు..!!
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సమరానికి పార్టీ అధినేతతో సమరశంఖం పూరించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో తీవ్ర నైరాశ్యం ఆవహించిన నేతల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో అగ్రనేతలు, కార్యకర్తల్లో నూతన జోష్ రావడం ఖాయమని పార్టీ విశ్వాసంతో ఉంది. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ చేరుకుంటారు.
అక్కడ నుంచి నేరుగా శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు వెళతారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు క్లాసిక్ కన్వెన్షన్ పక్కన ఉన్న మైదానంలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. సాయంత్రం 6.30 గంటల తరువాత సభ నుంచి తిరిగి ఎయిర్‌పోర్టుకు బయల్దేరతారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి బయల్దేరి వెళతారు.

నేటి మధాహ్నం నుండి శంషాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభ ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాహుల్‌గాంధీ సభ జరగనుంది. దీని దృష్ట్యా శంషాబాద్ మీదుగా కర్నూలు, బెంగళూరు వెళ్లే వాహనాల దారి మళ్లింపును చేపట్టారు. ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా శంషాబాద్ అవతల ఎన్‌హెచ్‌కు చేరుకోవాలని పోలీసులు సూచించారు. వాహనదారులు ఆరాంఘర్-శంషాబాద్ మార్గంలోకి వెళ్లొద్దన్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా దారి మళ్లింపు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications