Alert: హైదరాబాద్లో అటు వైపు వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..
హైదరాబాద్ లోని సైబరాబాద్ పరిధిలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ (రాయదుర్గం మెట్రో స్టేషన్) నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు ప్రకటన చేశారు.

బయోడైవర్సి
సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ మీదుగా బయోడైవర్సిటీ వైపు వాహనాలను రానివ్వరు. కేపీహెచ్ బీ ఆర్వోబీ నుంచి సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే వెహికల్స్ సైబర్ టవర్స్ జంక్షన్, మెటల్ చార్మినార్, సీఐఐ జంక్షన్, కొత్తగూడ జంక్షన్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్లాలి. హైటెక్స్ నుంచి సైబర్ టవర్స్, బయోడైవర్సిటీ వైపు వచ్చే వెహికల్స్ సైబర్ టవర్స్, సీవోడీ సిగ్నల్ వద్ద రైట్ టర్న్ తీసుకుని నెక్టార్ గార్డెన్, ఐ ల్యాబ్, ఎన్సీబీ రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

టెక్ మహీంద్రా
సీఐఐ, టెక్ మహీంద్రా, డెల్ కంపెనీ రోడ్ నుంచి బయోడైవర్సిటీ, ఇనార్బిట్ మాల్ వైపు వచ్చే వాహనాలను టీసీఎస్ జంక్షన్ నుంచి లెఫ్ట్, సైబర్ టవర్స్ వద్ద రైట్ టర్న్ తీసుకుని సీవోడీ సిగ్నల్,నెక్టార్ గార్డెన్, ఐ ల్యాబ్, ఐటీసీ రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కావూరి హిల్స్ నుంచి సైబర్ టవర్స్, కేపీహెచ్బీ ఆర్వోబీ నుంచి సైబర్ టవర్స్, సీవోడీ జంక్షన్, హైటెక్స్ జంక్షన్నుంచి సైబర్ టవర్స్, సైబర్ టవర్స్ నుంచి కొత్తగూడ జంక్షన్, టీసీఎస్ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్, ఎన్ఐఏ నుంచి ఎస్బీఐ పర్వత్నగర్, నీరూస్ జంక్షన్నుంచి పర్వత్నగర్ వైపు వెళ్లే రద్దీ పెరిగే అవకాశం ఉంది.

ఉదయం 7.30 నుంచి
మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు కేపీహెచ్బీ ఆర్వోబీ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు ఐకియా అండర్ పాస్ మీదుగా వచ్చే వెహికల్స్ సైబర్ టవర్ జంక్షన్, సీవోడీ సిగ్నల్ వద్ద రైట్ టర్న్ తీసుకుని నెక్టార్ గార్డెన్, ఐ ల్యాబ్స్, ఐటీసీ కోహినూర్ హోటల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని డీసీపీ తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications