హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్-కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే.. విజయంపై ఇరుపార్టీల ధీమా

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. విక్టరీ కొట్టాలని భావిస్తూ.. గెలుపుగుర్రాలకు టికెట్లు కేటాయించారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో.. స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించాయి. టీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచార రథ సారథులను వెల్లడించాయి. తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని గులాబీ దళం కోరతుండగా.. అధికారం అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది.

టీఆర్ఎస్ నుంచి వీరే..

టీఆర్ఎస్ నుంచి వీరే..

స్టార్ క్యాంపెయినర్లతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. అధికార టీఆర్‌‌ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌‌ను ప్రకటించింది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారు. కేసీఆర్ ఒక బహిరంగ సభలో ప్రసంగించనుండగా.. కేటీఆర్ మాత్రం గ్రేటర్ ఎన్నికలను తన భుజాలపై వేసుకున్నారు. మంత్రులు హరీశ్ రావ్, మహమూద్ అలీ, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్‌‌, సబితా ఇంద్రా రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ తమ పార్టీ స్టార్ క్యాంయినర్లుగా టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.

 కాంగ్రెస్ రథసారథులు

కాంగ్రెస్ రథసారథులు

ఇటు కాంగ్రెస్ కూడా స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌‌ రెడ్డితో లిస్ట్ ప్రారంభమయ్యింది. రథసారథిగా ఆయనే ఎన్నికలకు ముందుకెళ్తున్నారు. గెలుపు కోసం అహార్నిసలు శ్రమిస్తున్నారు. పార్టీ గెలిచినా/ ఓడిపోయినా ఆయనే తీసుకోవాల్సి ఉంటుంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజరుద్దీన్, వీ హనుమంత రావు, అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీను పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా కాంగ్రెస్ ప్రకటించింది.

Recommended Video

GHMC Elections 2020 : Janasena Out to Support BJP తప్పుకొనేలా పవన్ కల్యాణ్‌ను ఒప్పించారు...!!
ప్రచార హోరులో పార్టీలు

ప్రచార హోరులో పార్టీలు

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయ దుందుబి మోగించడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. బల్దియాలో విజయం సాధించి.. ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగు వేస్తోంది. మధ్యలో కాంగ్రెస్, మజ్లీస్ కూడా తమ వంతుగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచార బరిలో దూసుకెళ్తున్నాయి.

English summary
trs-congress party announced their star campaigners
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X