ఎందుకా ఏడుపు, బండి సంజయ్‌పై కవిత విసుర్లు
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ జోరుగా సాగుతోంది. ఇరు పార్టీల నేతలు మాటలతో కత్తులు దూసుకుంటున్నారు. బీజేపీ, బండి సంజయ్ లక్ష్యంగా ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం తాండూరులో టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. బీజేపీకి ఓ సిద్ధాంతం అంటూ లేదని, వారు ఎప్పుడూ ప్రజల్లో లేరని దుయ్యబట్టారు.

భయపడబోం..
బీజేపీ ఏం చేసినా తెలంగాణ ప్రజలు భయపడబోరని కవిత తేల్చి చెప్పారు. తమ నేతలు చట్టబద్ధంగానే వ్యాపారాలు చేసుకుంటున్నారని స్పష్టంచేశారు. అధికారులు వచ్చి అడిగితే పత్రాలు ఇస్తామని, చూసుకుని వెళ్లాలని అన్నారు. బండి సంజయ్ యాదగిరిగుట్ట వెళ్లి దొంగ ప్రమాణాలు చేశారని ఫైరయ్యారు. నిన్న ఓ సభలో ఏకంగా ఏడ్చేశారని, ఎందుకు ఏడ్చారో తెలియదని సెటైర్లు వేశారు.

అరెస్ట్ చేయొద్దా..?
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొరికిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయొద్దని బండి సంజయ్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కోసం కోర్టుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. విచారణకు కూడా రానని సంతోష్ అంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మంత్రులు ఏ దర్యాప్తు సంస్థ పిలిచినా వెళుతున్నారని.. వారీ పక్షాన ఏ తప్పు లేదని చెప్పారు.

గద్దల్లా వచ్చి తన్నుకుపోవాలని..
టీఆర్ఎస్ పార్టీ నేతలను గద్దల్లా వచ్చి తన్నుకుపోవాలని బీజేపీ చూస్తోంది తప్పితే, వారికి మరో లక్ష్యం లేదని కవిత ఫైరయ్యారు. రాముడి పేరు చెప్పడం, రౌడీయిజం చేయడం తప్ప ఆ పార్టీకి మరో పని లేదని విమర్శించారు. బీజేపీకి ఓ అబద్ధాల వాట్సాప్ వర్సిటీ ఉందని కవిత విరుచుకుపడ్డారు. అందులో అన్నీ అబద్ధాలే చెబుతారని ఫైరయ్యారు.

ఖర్గేతో కవిత
ఇటీవల కవిత అర్వింద్‌పై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఖర్గేతో కవిత మాట్లాడారని అర్వింద్ కామెంట్ చేయగా.. కవిత ఫైరయ్యారు. చెప్పుతో కొడతా అని విరుచుకుపడ్డారు. తర్వాత అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications